నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలి పెట్టను: లోకేష్
తనపై తప్పుడు ప్రచారం చేసేవారిని వదిలి పెట్టనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు.
మంగళగిరి: తనపై తప్పుడు ప్రచారం చేసే వారిని ఎవరినీ కూడ వదిలిపెట్టనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పారు.శుక్రవారంనాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరిలో లోకేష్ మీడియాతో మాట్లాడారు.
తన రాజకీయ ఎదుగుదలను చూసి అసత్య ఆరోపణలు చేస్తున్నార్ననారు. అసత్య ఆరోపణలకు చెక్ పెట్టాలనే పరువు నష్టం దావాలు వేస్తున్నానని లోకేష్ చెప్పారు.
పోతుల సునీతపై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశానన్నారు. తనపై చేసిన ఆరోపణలను ఒక్కటి నిరూపించలేకోపోయారన్నారు.వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై నారాసుర రక్త చరిత్రంటూ అసత్యాలు రాశారన్నారు.
వివేకా హత్యలో జగన్ పాత్రపై సీబీఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలపై తాను చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తామని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. 40 ఏళ్లుగా తమ కుటుంబం అసత్య ఆరోపణల్ని భరిస్తూనే ఉందని లోకేష్ చెప్పారు.
టీడీపీ హాయంలో రూ. 6 లక్షల కోట్ల అవినీతి అని పుస్తకం రాశారన్నారు. కనీసం వైసీపీ సర్కార్ ఆరు పైసల అవినీతి అని కూడ నిరూపించలేకపోయిందన్నారు.
సీఎం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ గా సీఐడీ మారిపోయిందని ఆయన విమర్శించారు.
దేవాన్ష్ పుట్టినప్పటి నుండి టీటీడీలో అన్నదానానికి రూ. 2 కోట్ల విరాళం ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమపై పింక్ డైమండ్ దొంగతనం ఆరోపణలు చేసి పారిపోయారని లోకేష్ విమర్శలు చేశారు.తనపై ఆరోపణలకు సవాల్ విసిరినా, వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. కనీసం ఒక్కటైనా నిరూపించారా అని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించగలరా అని ఆయన ప్రశ్నించారు.