టిటిడిలో అవినీతిని నిరూపించేందుకు సిద్దం: టిడిపికి కన్నా సవాల్

I'm ready to prove corruption in TTD says Kanna Laxminarayana
Highlights

బాబుపై కన్నా హట్ కామెంట్స్


శ్రీకాకుళం:టిటిడిలో చోటు చేసుకొన్న అవినీతిని నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఈ విషయంలో మీరు సిద్దంగా ఉన్నారా అని బిజెపి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.  కేంద్రం, ప్రధానమంత్రి మోడీపై  టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆయన మండిపడ్డారు.

గురువారం నాడు ఆయన  శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న అభివృద్దికి ఖర్చు చేస్తున్న ప్రతి పైసా కేంద్రం నుండి వచ్చిందేనని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నీచమైన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని  ఆయన ఆరోపించారు. విభజన చట్టంలో  ఉన్నా లేకున్నా ఏపీ రాష్ట్రాభివృద్దికి చిత్తశుద్దితో  బిజెపి పనిచేస్తోందని ఆయన చెప్పారు. 

4 ఏళ్ళుగా శ్రీకాకుళం జిల్లా అభివఈద్దికి ఏం చేశారో చెప్పాలని చంద్రబాబును కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరూ కూడ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 

రాయలసీమపై టిడిపికి చిత్తశుద్ది ఉంటే  సీమలో ఇంకా నీటి కరువు ఎందుకు తీరలేదని ఆయన ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ పాపం టిడిపిదేనని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు. 

loader