తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. అలిపిరి నడక‌మార్గంలోని గాలిగోపురం వద్ద ఈ ఘటన జరిగింది. 

తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. అలిపిరి నడక‌మార్గంలోని గాలిగోపురం వద్ద ఈ ఘటన జరిగింది. 

శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా వస్తుంటే ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. అతడిని హైదరాబాదుకి చెందిన బిటెక్ విద్యార్ధి రాహుల్ గా గుర్తించారు. నడుస్తూ ఒక్కసారి కుప్పకూలిన వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది గుర్తించి వెంటనే ప్రథమచికిత్స అందించారు.

అయితే అప్పటికే రాహుల్ తుది శ్వాస విడిచాడు. దీంతో మృతిదేహాన్ని శవపరీక్షల‌ నిమిత్తం తిరుపతి రుయాకి తరలించారు. దైవదర్శనానికి వచ్చి.. దేవుడి దగ్గరికే చేరుకున్నాడని అందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు.