I am going to my dream land" అని అన్న కు మెసెజ్ పెట్టిన నాగసాయి ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు.
‘నా డ్రీమ్ ల్యాండ్ కు వెళుతున్నా అంటూ సోదరుడికి ఫోన్ లో మెసేజ్ పెట్టి విజయవాడకు చెందిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు.హైదరాబాదు CGI అనే సాప్ట్ వేర్ కంపెనీల పనిచేస్తున్న నాగ సాయి స్వస్థలం విజయవాడ. గత నెల తల్లిదండ్రుల వద్దకు వచ్చిన అతడు నిన్న తిరుపతి వెళ్ళి వస్తాను అని ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు.
అయితే సాయంత్రం ఏడు గంటలకు అతని ఫోన్ నుంచి సోదరుడికి ఒక మెసేజ్ వచ్చింది. I am going to my dream land" అని అన్న కు మెసెజ్ పెట్టిన నాగసాయి ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. అతను వెళ్లిన బైక్ ను మాత్రం విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద కనుగొన్నారు. అయితే నిన్న రాత్రి నుంచి నాగసాయి ఆచూకీ తెలియకపోవడంతో అతని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
