Asianet News TeluguAsianet News Telugu

ఈటల కోసం 700కిలోమీటర్ల పాదయాత్ర... అభిమానులకు ఏపీలో ఘన స్వాగతం

ఈటల రాజేందర్ గెలుపుతర్వాత మొక్కులు చెల్లించుకునేందుకు కరీంనగర్ నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న ఆయన అభిమానులకు శ్రీకాళహస్తిలో ఘన స్వాగతం లభించింది. 

huzurabad mla eatala rajender supporters karimnagar to tirumala padayatra
Author
Srikalahasti, First Published Dec 1, 2021, 3:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఎదిరించి బిజెపి తరపున ఫోటీచేసి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. దళిత బంధు వంటి పథకంతో పాటు అబివృద్ది, సంక్షేమ పథకాలను కాదని హుజురాబాద్ ప్రజలు ఈటలకే పట్టం కట్టారు. ఇలా భారీ మెజారిటీలతో ఈటల గెలిచిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొందరు కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకన్నకు మొక్కు తీర్చుకునేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా కరీంనగర్ నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. 

కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన eatala rajender supporters పాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చేరుకుంది. ఈ సందర్భంగా పాతబస్టాండ్ వద్ద ఏపీ బిజెపి నాయకులు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర బృందానికి  శ్రీకాళహస్తి సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, పుణ్యం ఢిల్లీ కుమార్, ఇమ్మడిశెట్టి మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.    రాత్రి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం లో నిద్రించిన వీరు ఇవాళ ఉదయం తిరిగా పాదయాత్ర ప్రారంభించారు. 

వీడియో

 కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం నుండి నవంబర్ పదవ తేదీన పాదయాత్ర మొదలయ్యింది. సుమారు ఏడు వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్లి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. రాజా రెడ్డితో పాటు కరుణాకర్ గౌడ్, సుభాష్ గౌడ్, నిఖిల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సాయి మహేందర్ గౌడ్, హేమంత్ గౌడ్, సాయి గౌడ్, ప్రవీణ్ సాగర్ యాదవ్, మహేష్ యాదవ్ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

READ MORE  కేసీఆర్ అహంకారం ఓడినందుకు మొక్కు చెల్లింపు...: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈటల కామెంట్స్ (వీడియో)

ఇక హుజురాబాద్ ఉపఎన్నిక విజయం తర్వాత ఈటల రాజేందర్ కూడా దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవల భద్రాచలం సీతారామస్వామి ఆలయానికి వెళ్లిన ఈటల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. BJP Leaders తో కలిసి  bhadrachalam seetharamachandra swamy దేవాలయానికి చేరుకున్న eatal rajender ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన గెలుపుకోసం ప్రార్థించిన భక్తుల తరపున ఈటల మొక్కులు చెల్లించుకున్నారు.  

 ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... huzurabad bypoll లో ధర్మం గెలిస్తే, న్యాయం నిలబడితే, CM KCR అహంకారం ఓడిపోతే భద్రాద్రి శ్రీరాముని సన్నిధిలో పూజలు చేస్తామని వేలాదిమంది తెలంగాణ ప్రజలు మొక్కుకున్నారన్నారు. వారి తరపున ఆ మొక్కులనే చెల్లించుకున్నానని ఈటల అన్నారు. త్వరలోనే సమ్మక్క సారక్క అమ్మవార్లను కూడా మొక్కు చెల్లుంచుకుంటానని ఈటల తెలిపారు. 

ఇక ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలోని బత్తువాని పల్లి గ్రామానికి ఈటల మొదటిసారి వెళ్లిన ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలోని హనుమాన్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కరిస్తానని ఈటల గ్రామస్తులకు హామీ ఇచ్చారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios