Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ అహంకారం ఓడినందుకు మొక్కు చెల్లింపు...: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈటల కామెంట్స్ (వీడియో)

హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత మొదటిసారి భద్రాచలం సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు. 

eatala rajender visited bhadradri  temple
Author
Bhadrachalam, First Published Nov 29, 2021, 2:52 PM IST

ఖమ్మం: హుజురాబాద్ ఉపఎన్నికలో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఎదిరించి ఈటల రాజేందర్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. టీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరిన ఈటలను ఓడించడానికి అధికార టీఆర్ఎస్ విశ్వప్రయత్నం చేసింది. దళిత బంధు వంటి కనీవిని ఎరుగతి పథకంతో పాటు అభివృద్ది, సంక్షేమ హామీలిచ్చినా ఈటలను గెలుపును అడ్డుకోలేకపోయారు. ఇలా ఘనవిజయం అనంతరం బిజెపి ఎమ్మెల్యే ఈటల వివిద దేవాలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. 

సోమవారం ఈటల రాజేందర్  bhadrachalam seetharamachandra swamy ని దర్శించుకున్నారు. BJP Leaders తో కలిసి భద్రాచలం దేవాలయానికి చేరుకున్న eatal rajender సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన గెలుపుకోసం ప్రార్థించిన భక్తుల తరపున ఈటల మొక్కులు చెల్లించుకున్నారు.  

వీడియో

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... huzurabad bypoll లో ధర్మం గెలిస్తే, న్యాయం నిలబడితే, CM KCR అహంకారం ఓడిపోతే భద్రాద్రి శ్రీరాముని సన్నిధిలో పూజలు చేస్తామని వేలాదిమంది తెలంగాణ ప్రజలు మొక్కుకున్నారన్నారు. వారి తరపున ఆ మొక్కులనే చెల్లించుకున్నానని ఈటల అన్నారు. త్వరలోనే సమ్మక్క సారక్క అమ్మవార్లను కూడా మొక్కు చెల్లుంచుకుంటానని ఈటల తెలిపారు. 

read more  రవిశంకర్ గురూజీని కలిసిన బిజెపి ఎమ్మెల్యే ఈటల... గంటసేపు భేటీ... అందుకోసమేనా?

"ఈ తెలంగాణ గడ్డమీద ఉన్న ఎంతో మంది ధర్మం, ప్రజాస్వామ్యం నిలబడాలని కాంక్షిస్తూ, న్యాయాన్ని కోరుకుంటూ ఎన్నో మొక్కులు మొక్కారు. వారందరూ నా గెలుపు తర్వాత మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది నా నియోజకవర్గంలోని ఇల్లందకుంట రాములవారి దేవాలయం నుండి తిరుమలకు దాదాపు 950 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఇలా నా కోసం దేవుళ్లకు మొక్కుకుని... ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్న వారందరికీ కృతజ్ఞతలు'' అని ఈటల పేర్కొన్నారు.

eatala rajender visited bhadradri  temple

''ఏ నమ్మకం, విశ్వాసం నా మీద ఉంచారో, ఏ బాధ్యత నా భుజాలమీద పెట్టారో దాన్ని నెరవేరుస్తాను. మీ బిడ్డగా ఒదిగి ఉంటాను. నోట్లో నాలుక లెక్క ఉంటాను. మీ ఆశయాల సాధనకోసం ముందుకు వెళ్తాను అని హామీ ఇస్తున్నా. నిబద్ధతతో, న్యాయంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కావలసిన ధైర్యాన్ని అందించాలని శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటున్నాను'' అని ఈటల అన్నారు.

eatala rajender visited bhadradri  temple

ఇక ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలోని బత్తువాని పల్లి గ్రామానికి ఈటల మొదటిసారి వెళ్లిన ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలోని హనుమాన్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కరిస్తానని ఈటల గ్రామస్తులకు హామీ ఇచ్చారు. 

read more  నిరుపేద మహిళలతో కలిసి ఈటల భోజనం... సోషల్ మీడియాలో ఫోటో చక్కర్లు, సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

ఇక ఇటీవల ప్రముఖ ఆద్యాత్మికవేత్త రవిశంకర్ గురూజీతో ఈటల భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని మానసగంగ ఆశ్రమానికి రవిశంకర్ విచ్చేయగా ఆయనను eatala rajender మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈటెలలతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి కూడా రవిశంకర్ గురూజీతో దాదాపు గంటసేపు భేటీఅయ్యారు. ఈ భేటీపై ప్రజల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios