భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలిసిన ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. విజయవాడలో, మంగళవారం సాయంత్రం పద్మ(28) అనే మహిళ కనకదుర్గమ్మ వారధి పైనుంచి నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పద్మ విజయవాడ యనమలకుదురులోని మార్కండేయ నగర్ లో నివాసముండేది. భర్త, అత్తల వేధింపులు పెడుతుండడంతో కొద్ది రోజుల కిందట తల్లిగారింటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. దీంతో వారధి పైనుంచి నదిలో దూకింది.
అదే టైంలో అక్కడనుంచి వెడుతున్న కొంతమంది ఇది గమనించి తాడేపల్లిలోని వారధి దగ్గరున్న ట్రాఫిక్ పోలీసులకు తెలిపారు. వెంటనే సీఐలు బ్రహ్మయ్య, అంకమరావు తమ సిబ్బందితో వెళ్లి చూడగా 23వ ఖానా వద్ద కృష్ణా నదిలో ఆమె కనిపించింది.
అప్పటికే అక్కడున్న యువకులు ఆమెను కాపాడి బైటికి తీశారు. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు, సురేష్, సతీష్, మరో ఇద్దరు ఏపీఎస్పీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మంచంపై పడుకోబెట్టి ..ఐదుగురు పోలీసులు అరకిలోమీటరు మేర ఇసుకలో నడుచుకుంటూ మోసుకెళ్లారు.
ఆ తరువాత ఆటోలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. తర్వాత ఆమెనుంచి వివరాలు తెలుసుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.