ప్రియురాలితో కలిసున్న భర్తను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న భార్య

Husband Caught His Wife with Her Lover Red Handed in vijayawada
Highlights

భర్త, అతడి ప్రియురాలిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు

భార్య ఉండగానే ఓ భర్త అడ్డదారులు తొక్కాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ మరో యువతితో అక్రమ సంబందం పెట్టుకున్నాడు. ఇంటికి రాకుండా ఆమెతోనే సహజీవనం కొనసాగిస్తున్నాడు. దీంతో విసిగి పోయిన ఆ మహిళ ఏకంగా భర్త ప్రియురాలితో కలిసి వున్న సమయంలో రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా పెద్దపరినికి చెందిన సురేష్ కుమార్ కు రమాదేవి తో వివాహమైంది. సురేష్్ భార్యతో కలిసి ఉద్యోగ నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడు. అయితే ఇతడికి విజయవాడలో ఓ యువతితో పరిచయం ఏర్పడి అదికాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ప్రియురాలిని ఓ ఇంట్లో అద్దెకు ఉంచి ఆమెతోనే ఉంటూ కుటుండాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు.  దీంతో ఇతడి వ్యవహారాన్ని బయటపెట్టాలని భాక్య రమాదేవి పథకం వేసింది.

భర్త ప్రియురాలితో కలిసి వున్న సమయంలో పట్టుకుని ఇద్దర్ని రోడ్డు పైకి ఈడ్చింది. అందరూ చూస్తుండగానే సదరు ప్రియురాలిపై దాడికి దిగింది. అంతే కాకుండా ఇద్దరిపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన భర్త, ఈ యువతి సహజీవనం చేస్తున్నారని తనకు చాలా రోజుల క్రితమే తెలుసని రమాదేవి చెబుతోంది. ఆధారాల కోసం ఎదురు చూసి అందరి ముందు వాళ్లను పట్టుకున్నానంది. సదరు యువతి ఉంటున్న ఇంటికి అద్దె కూడా తనభర్తే చెల్లిస్తున్నాడని చెప్పింది. వారిపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని రమాదేవి పోలీసులను కోరింది.
 

loader