భార్యను హత్య చేసి దాన్ని ప్రమాదవశాత్తుగా కిందపడి చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ భర్త. తీరా పోలీసులకు అనుమానం వచ్చి  విచారిస్తే తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఆదివారం మీడియా ఎదుట హాజరుపరిచారు. డీఎపస్పీ సునీల్ వెల్లడించిన వివరాల మేరకు కడప ఓంశాంతినగర్ రోడ్డు నంబరు 14లో ఉండే లక్ష్ముమయ్య, అన్నపూర్ణమ్మలిద్దరూ హోమియోపతి వైద్యులే. 

వీరికి వెంకట వరలక్ష్మీ నవ్యప్రణితి అనే 18యేళ్ల కూతురుంది. ఈమె జార్జియా లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చేస్తూ మూడునెలల కిందట అనార్యోగంతో అక్కడే చనిపోయింది. కూతురు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు రూ. 4 లక్షల వరకు ఖర్చు చేశారు. దీనికోసం భార్యభర్తలిద్దరూ అప్పులు చేశారు. 

దీంతో చేసిన అప్పులు తీర్చడానికి డబ్బులు, బంగారు నగలు తీసుకుని రావాలంటూ భార్యను పుట్టింటి పంపించాడు. కానీ భార్య డబ్బులు, బంగారు నగలు తీసుకురాలేదు. సరికదా లక్షుమయ్య వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య తన తల్లి, బంధువులకు ఫిర్యాదు చేసింది. అది మనసులో పెట్టుకుని లక్షుమయ్య ఈ నెల 22వ తేదీ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్నపూర్ణమ్మను సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. 

ఎవరికీ అనుమానం రాకుండా సాక్ష్యాధారాలు లేకుండా రక్తపు మరకలను తుడిచివేశాడు. మూర్ఛ రావడంతో కిందపడి తలకు దెబ్బ తలిగినట్లు చితరీకరించి ఇంట్లో ఉన్న దూది తీసుకుని కట్టుకట్టి నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించాడు. అక్కడ నుంచి ప్రభుత్వ సర్వజన అసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది. 

విషయం తెలుసుకున్న చిన్నచౌకు సీఐ అశోక్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాడు. ఆమె గాయాలను పరిశీలించగా కిందపడిన గాయాలు కాదని, ఎవరో కొట్టారని వైద్యులు దృవీకరించారు. వెంటనే భర్తను అదుపులోకి తీసుకుని విచారాంచగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. లక్షుమయ్య నుంచిి హత్యకు ఉపయోగించి సుత్తిని స్వాధీనం చేసుకన్నారు. చాకచక్యంతో హత్య కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సీఐ అశోక్ రెడ్డి, ఎస్సైలు సత్యనారాయణ, అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.