అధికారంపార్టీ ఎంఎల్ఏల ఆగడాలు ఎక్కువైపోతోంది. భూ కబ్జా కేసులో మొన్ననే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎంఎల్ఏ బోండా ఉమ భార్య సుజాతపై కేసు నమోదైంది. ఆ విషయం అలా ఉండగానే తాజాగా అనంతపురం జిల్లాలో మరో ఎంఎల్ఏపై ఫిర్యాదు వెలుగుచూసింది. జిల్లాలోని గుంతకల్లు టిడిపి ఎంఎల్ఏ జితేంద్ర గౌడ్ పై బిసి సంఘం మైనారిటీ సెల్ ఫిర్యాదు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో నియోజకవర్గంలోని ముస్లింలను లొంగదీసుకునేందుకు ఎంఎల్ఏ ఒత్తిడి పెడుతున్నారట. తనకు లొంగనివారిపై ఎంఎల్ఏ పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు సెల్ నేతలు మండిపడ్డారు. వారి ఫిర్యాదును విచారించిన మానవ హక్కుల సంఘం ఏప్రిల్ 17వ తేదీ నాటికి సమగ్ర నివేదికను అందించాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఎన్నికలు దగ్గర  పడేకొద్దీ ఇంకెంతమంది టిడిపి ఎంఎల్ఏలు వింత పోకడలు పోతారో చూడాల్సిందే.