ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఎంతమందికి వచ్చే ఎన్నికల్లో టిక్కుట్లు లభిస్తుందనే విషయమై పార్టీలో చర్చ మొదలైంది. కొందరికి టిక్కెట్లలో కోత పడుతుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఎందుకంటే, ఏవో ప్రలోభాలకు గురై పార్టీ ఫిరాయింపులైతే చేసారు కానీ వారికి వారి నియోజకవర్గాల్లో బాగానే వ్యతిరేకత ఉందన్న విషయం వాస్తవం. బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములుపై అందరి ముందు చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాకుండా పార్టీ నేతలను కలుపుకునిపోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కుడా ఇచ్చేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఎంతమందికి వచ్చే ఎన్నికల్లో టిక్కుట్లు లభిస్తుందనే విషయమై చర్చ మొదలైంది. కొందరికి టిక్కెట్లలో కోత పడుతుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఎందుకంటే, ఏవో ప్రలోభాలకు గురై పార్టీ ఫిరాయింపులైతే చేసారు కానీ వారికి వారి నియోజకవర్గాల్లో బాగానే వ్యతిరేకత ఉందన్న విషయం వాస్తవం.
పార్టీ ఫిరాయించినందుకు ఇటు వైసీపీ శ్రేణులు మండిపడుతుండగా, అటు టిడిపి శ్రేణులు కుడా విరుచుకుపడుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు టిడిపి నేతలు కుడా ఏమాత్రం సహకరించటం లేదు. అందుకే తరచూ గొడవలవుతున్నాయి.
ఇటువంటి నేపధ్యంలో కడపలో జయరాములు విషయం వెలుగుచూసింది. బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములుపై అందరి ముందు చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాకుండా పార్టీ నేతలను కలుపుకునిపోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కుడా ఇచ్చేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపేమో నేతలు కలిసిరావటంలేదు. ఇంకోవైపేమో చంద్రబాబు వార్నింగ్. దాంతో జయరాముల్లో గుబులు మొదలైంది. ఇదే పరిస్ధితిని మరికొందరు పిరాయింపు ఎంఎల్ఏలు కుడా ఎదుర్కొంటున్నారు.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాషా పరిస్ధితి కుడా ఇదే. కడప జిల్లా జమ్మలమడుగు ఎంఎల్ఏ, మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు ఎంఎల్ఏ అశోక్ రెడ్డి, కర్నూలు జిల్లాలో కర్నూలు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి, కోడుమూరు ఎంఎల్ఏ మణిగాంధితో పాటు మరికొందరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు చేయించిన ఏ సర్వేలో కుడా పెద్ద సానుకూలంగా రిపోర్టు రాలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది
మొత్తం 20 మంది ఎంఎల్ఏల్లో ఫిరాయింపు మంత్రులతో పాటు మరో నలుగురికి తప్ప మిగిలిన వారికి టిక్కెట్లు డౌటే అని టిడిపిలో ప్రచారం జరుగుతోంది. తాజాగా జయరాములు వ్యవహారంతో అటువంటి వారిలో అయోమయం ఎక్కువైంది. కాకపోతే ప్రస్తుతానికి జయరాములు విషయంలో మాత్రమే అధినేత వైఖరి బయటపడింది. ఇంకెన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు వైఖరి బయటపడుతుందో చూడాలి.
