ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముందుగా వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని న్యాయవాది యలమంచిలి బాలాజీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముందుగా వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని న్యాయవాది యలమంచిలి బాలాజీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఒకవేళ ఈవీఎం, వీవీప్యాట్‌ల మధ్య ఏవైనా తేడాలు వస్తే అన్ని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కేబినెట్ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. హౌస్ మోషన్ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ ఇంట్లో వాదనలు జరగనున్నాయి.