హైదరాబాద్: ప్రాణాలకు తెగించి మరీ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఓ హోం గార్డ్ ను ప్రజలు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ హై వే పెట్రోలింగ్ వాహన డ్రైవరు గా అర్జున్ పనిచేస్తున్నాడు.

 తన ప్రాణాలను పణంగా  పెట్టి నీటి వరదలో కోటుకుపోతున్న ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. దీంతో క్లిష్ట సమయంలో విధులు నిర్వహిస్తు ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడిన ఆయనను పలువురు అభినందించారు.

 తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట్ సమీపంలోని రామవరం వద్ద  వరద నీటిలో కొట్టుకుపోతున్న పలువురిని ఆయన కాపాడాడు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు అన్నివేళల అప్రమత్తతో అనుక్షణం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న విషయం తెలిసిందే.

 తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట్ సమీపంలోని రామవరం వద్ద పుష్కర కెనాల్,  పోలవరం కెనాల్ నుండి వర్షపు నీరు ఉదృతంగా జాతీయ రహదారిపై ప్రవహిస్తున్నాయి. 

దీంతో సమీపంలోని ఓ కర్మాగారం లో పని చేస్తున్న కార్మికులు నివసిస్తున్నా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనంలోని  కార్మికులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు గ్రహించిన అర్జున్ ప్రాణాలకు తెగించి కార్మికులను రక్షించాడు.  

పెట్రోలింగ్ వాహన డ్రైవరు అర్జున్  హుటాహుటిన ప్రాణాలకు తెగించి కార్మికులను సురక్షితంగా బయటకు తిసుకు వచ్చాడు. విధినిర్వహణలో పెట్రోలింగ్ వాహన డ్రైవరుచూపించిన దైర్యం,తెగువను డి‌జి‌పి గౌతం సవాంగ్  జిల్లా ఎస్పీ అభినందించారు.