అమరావతి:ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ సీఎం జగన్ కు హైపవర్ కమిటి సోమవారం నాడు నివేదిక అందించింది.

అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  హైపవర్ కమిటి ఛైర్మెన్ నీరబ్ కుమార్ ప్రసాద్, కమిటి సభ్యులు వలవన్ లు సీఎం జగన్  కు నివేదికను ఇచ్చారు. మరో వైపు ఈ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖపట్టణం కలెక్టర్ వినయ్ చంద్, సీపీ రాజీవ్ కుమార్ మీనాలు  పాల్గొన్నారు.

also read:మీ వద్దకు రానీయలేదు: ఏల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు చంద్రబాబు లేఖలు

ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీకేజీ ఎలా జరిగిందనే విషయాన్ని నివేదికలో కమిటి  పొందుపర్చింది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడ కమిటి పలు సిఫారసులు చేసింది.ఈ ప్రమాదంపై ప్రత్యక్షసాక్షులు, ఫ్యాక్టరీ వర్గాలు, అధికారులతో చర్చించిన తర్వాత కమిటి నివేదికను అందించింది.

ఈ ఏడాది మే 7వ తేదీన విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 12 మంది మరణించారు.  గ్యాస్ లీకేజీ ఘటనపై  హైపవర్ కమిటిని ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం జగన్ అదే రోజున ప్రకటించారు.

ఈ ఫ్యాక్టరీలో స్టైరెన్ స్టోరేజీ ట్యాంక్స్ పాతవి కావడంతో పాటు ఉష్ణోగ్రతలను సూచించే పరికరాలు లేకపోవడంతో పాటు 24 గంటల పాటు కూలింగ్ సిస్టం 24 గంటలు నడపకపోవడం వల్ల కూడ ప్రమాదానికి కారణమని నిపుణుల కమిటి ఇదివరకే ప్రాథమికంగా తేల్చిన విషయం తెలిసిందే.