Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియోను అమెరికాలో టెస్ట్ చేయించాలి: గోరంట్ల మాధవ్

ఓటుకు నోటు కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై స్వతంత్ర్య దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరలైన వీడియో అసలుదేనని అమెరికా ల్యాబ్ చెప్పినట్టుగా టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారన్నారు. 

Hindupur MP Gorantla Madhav Demands Chandrababu Naidu Cash For Vote case Audio test in USA Lab
Author
Guntur, First Published Aug 14, 2022, 1:38 PM IST

కర్నూల్: ఓటుకు నోటు కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు  ఆడియోపై స్వతంత్య దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.
న్యూఢిల్లీ  నుండి తన నియోజకవర్గానికి వెళ్తూ మార్గమధ్యలోని కర్నూల్ లో గోరంట్ల మాధవ్ మీడియాతో ఆదివారం నాడు మాట్లాడారు. 

కర్నూల్ లో గోరంట్ల మాధవ్ కు కురుబ సంఘం నేతలు ఘనంగా స్వాగతం పలికారు. టోల్ ప్లాజా బళ్లారి చౌరస్తా వరకు  గోరంట్ల మాధవ్ ను స్వాగతం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. 

ఈ ఆడియోను పరీక్ష చేయించి ఫేక్  అని నిరూపించగలరా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు గోరంట్ల మాధవ్.. తన వీడియోపై పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయనివ్వాలని ఆయన సూచించారు. బీసీలను అణగదొక్కేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. 

 చంద్రబాబుకు చెందిన ఆడియో ను కూడా అమెరికా ల్యాబ్ లో పరీక్ష చేయించాలని ఆయన కోరారు.  ఒరిజినల్ వీడియో తన వద్ద ఉందని పోలీసులు అడిగితే ఈ వీడియోను ఇస్తానని గోరంట్ల మాధవ్ చెప్పారు.ఫేక్ వీడియో పై దుష్ప్రచారం చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ వీడియో అని అమెరికాలో ల్యాబ్ తేల్చినట్టుగా టీడీపీ నేతలు చెప్పడం దుర్మార్గమన్నారు. టీడీపీ నేతలే తీర్పులు, ఉత్తర్వులు ఇస్తున్నారన్నారు. తాను తప్పు చేయలేదన్నారు. అంతేకాదు కులాల మధ్య చిచ్చు కూడ పెట్టలేదని స్పష్టం చేశారు.  ఫేక్ వీడియోలతో బలహీన వర్గాలను చంపాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం నెరవేదని ఆయన చెప్పారు. 

ఈ నెల 10వ తేదీన ఈ వీడియో అసలుది కాదు నకిలీదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఈ వీడియోను పోస్టు చేసిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు.  ఈ వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసినట్టుగా ఉందన్నారు ఒరిజినల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతామని ఎస్పీ వివరించారు.

మార్ఫింగ్ వీడియోతో తనపై దుష్ట్ప్రచారం చేస్తున్నారని కూడా గోరంట్ల మాధవ్ ఆరోపించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా  మారగానే ఈ విషయమై ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

also read:ఆ వీడియో మార్ఫింగ్‌దే... దమ్ముంటే మాధవ్‌దేనని నిరూపించాలి : టీడీపీకి ఆదిమూలపు సురేష్ సవాల్

అనంతపురం ఎస్పీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండా ఈ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఎలా చెబుతారని కూడా టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఎస్పీ ఫోరెన్సిక్ నిపుణుడా అని అడిగారు..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సమయంలో న్యూఢిల్లీలో ఉన్న ఎంపీ మాధవ్ ఇవాళ స్వంత జిల్లాకు వస్తున్నారు. దీంతో కురుబ సంఘం నేతలు మాధవ్ కు స్వాగతం పలుకుతున్నారు.   ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలోకి మాధవ్ రాకను నిరసిస్తూ ఇవాళ టీడీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు.  దీంతో పోలీసులు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ ముందస్తు అరెస్ట్ లపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios