క్రికెటర్‌ సుష్మా వర్మకు డీఎస్పీ ఉద్యోగం హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం
మహిళా ప్రపంచకప్ ఫైనల్ కి చేరి దురదృష్టవశాత్తు ఓడిన , భారత క్రీడాకారిణిలపై వరాల జల్లు కురుస్తోంది. ఇప్పటికే హర్మన్ప్రీత్ కౌర్కి పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించగా, తాజాగా మరో క్రికెటర్ సుష్మా వర్మకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ప్రకటించింది.
మహిళా జట్టులో వికెట్ కీపర్గా ఉన్న సుష్మా వర్మకు డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన సుష్మా సారథ్యం హిమాచల్ ప్రదేశ్ జట్టు సాధించిన విజయాలను గుర్తుచేసారు.
వికెట్ కీపర్ గా,బ్యాట్స్ఉమెన్గా వరల్డ్ కప్ లో ప్రతిభ కనభర్చినందుకు సుష్మాకు హిమాచల్ ప్రభుత్వం తరపున ఉద్యోగాన్ని ప్రకటించామని సీఎం తెలిపారు. ఇప్పటికే రైల్వే శాఖలో పని చేస్తున్న సుష్మా వర్మ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ని రిసీవ్ చేసుకుంటుందో లేదో చూడాలి.
