సదావర్తి భూముల వేలంపాట వ్యవహారం కీలక మలుపు తిరిగింది. 84 ఎకరాలను రెండు రోజుల క్రితం వేలంపాటలో 60.30 కోట్లకు దక్కించుకున్న బిల్డర్ వెనక్కు తగ్గటంతో అంతటా అయోమయం నెలకొంది.
సదావర్తి భూముల వేలంపాట వ్యవహారం కీలక మలుపు తిరిగింది. 84 ఎకరాలను రెండు రోజుల క్రితం వేలంపాటలో 60.30 కోట్లకు దక్కించుకున్న బిల్డర్ వెనక్కు తగ్గటంతో అంతటా అయోమయం నెలకొంది. భూముల్లో లీగల్ సమస్యలున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారని, కాబట్టే తాము ఆ భూములను కొనదలచుకోలేదని బిల్డర్ శ్రీనివాసులరెడ్డి చెప్పటం గమనార్హం. వేలం జరిగి 48 గంటలైనా పాటదారుడు డబ్బును డిపాజిట్ చేయటానికి ముందుకు రాలేదు.
సత్రం భూములకు జరిగిన బహిరంగ వేలంలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ యజమాని శ్రీనివాసరెడ్డి ఆ భూములను అందరికన్నా ఎక్కువ ధరకు పాడుకోవటంతో భూములు బిల్డర్ సొంతమయ్యాయి. అయితే, వేలంపాటలో వెయ్యికోట్ల కుంభకోణం జరిగిందని మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి హై కోర్టులో పిటీషన్ వేసారు. అంతేకాకుండా అంతుకుముందే ప్రభుత్వం కూడా సదరు భూములు మొత్తం లీగల్ సమస్యలతో ఉందని చెప్పటంతో బిల్డర్ వెనక్కు తగ్గినట్లు సమాచారం. దాంతో ఇపుడేం చేయాలో ప్రభుత్వానికి అర్ధం కావటం లేదు.
