విశాఖలో ఆరుగురి హత్య: ఘటనాస్థలిలోనే మృతదేహాలు, కలెక్టర్ రాక కోసం ఆందోళన

విశాఖలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యా స్థలిలోనే ఇంకా ఆరు మృతదేహాలు వున్నాయి. మృతదేహాలను తరలించకుండా స్థానికులు అడ్డుకుంటున్నారు. కలెక్టర్ వచ్చే వారికి మృతదేహాలను తీయబోమంటున్నారు బంధువులు. 

six members of a family killed in visakhapatnam district case

విశాఖలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యా స్థలిలోనే ఇంకా ఆరు మృతదేహాలు వున్నాయి. మృతదేహాలను తరలించకుండా స్థానికులు అడ్డుకుంటున్నారు.

కలెక్టర్ వచ్చే వారికి మృతదేహాలను తీయబోమంటున్నారు బంధువులు. హత్యలు జరిగిన స్థలంలోనే పోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు అప్పలరాజు స్థలంలోనే అంత్యక్రియలు చేస్తామంటూ బంధువులు పట్టుబడుతున్నారు. దీంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. అప్పలరాజు తరపు బంధువుల్ని కూడా కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. 

Also Read:విశాఖ జిల్లాలో దారుణం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

కాగా, పెందుర్తి మండలం జుత్తాడలో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై పొరుగునే ఉండే అప్పలరాజు కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. మృతులు బొమ్మిడి రమణ(63), బొమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కళ్ల అరుణ (37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్‌(2), బొమ్మిడి ఉర్విష(8 నెలలు)గా గుర్తించారు.

ఘటన తర్వాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీన్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో జుత్తాడ ఉలిక్కిపడింది.. చనిపోయిన వారిలో చిన్నారుల కూడా ఉండటం స్థానికుల్ని తీవ్రంగా కలచివేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios