Asianet News TeluguAsianet News Telugu

విజయనగరం : బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ఆందోళన, అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

విజయనగరం (Vizianagaram District) జిల్లా బొబ్బిలి (bobbili Sugar factory) షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 17 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని రైతులు ఆందోళనకు దిగారు. అయితే అన్నదాతలను (farmers) పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

high tension in bobbili Sugar factory
Author
Bobbili, First Published Nov 3, 2021, 3:23 PM IST

విజయనగరం (Vizianagaram District) జిల్లా బొబ్బిలి (bobbili Sugar factory) షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 17 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని రైతులు ఆందోళనకు దిగారు. అయితే అన్నదాతలను (farmers) పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. పోలీసులపై రాళ్లు, కొబ్బరి బొండాలతో దాడి చేశారు. అయితే సుమారు మూడు, నాలుగు సంవత్సరాల నుంచి 17 కోట్ల మేర కంపెనీ యాజమాన్యం రైతులకు బకాయి పడింది. అరెస్ట్ చేస్తుండగా ఆగ్రహించిన రైతులు.. పోలీసులపై కర్రలతో తిరగబడ్డారు. హైవేపై రైతులు బైఠాయించడంతో రాయగడ (rayagada) జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇందుకు సంబంధించిన  మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios