Asianet News TeluguAsianet News Telugu

బలవంతంగా పోస్ట్‌మార్టానికి యత్నం: సంతకం పెట్టేందుకు సుబ్రమణ్యం భార్య ససేమిరా, తలను నేలకేసి కొట్టుకుని

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం భార్య అంగీకారంతో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. 

high tension at kakinada ggh over ysrcp mlc ananthababu ex car driver subramaniyam death case
Author
Kakinada, First Published May 21, 2022, 6:28 PM IST

కాకినాడ జీజీహెచ్ (kakinada ggh) వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు (ysrcp mlc ananthababu) మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యం భార్యను (subramaniyam dead body) మార్చురీ వద్దకు బలవంతంగా తీసుకొచ్చారు పోలీసులు. వ్యాన్ నుంచి కిందకి దిగిన సుబ్రమణ్యం భార్య తలను నేలకేసి బాదుకుంది. మార్చురీ వద్దకు దళిత సంఘాలు చేరుకోవడంతో గేటుకు వాహనాలను అడ్డుగా పెట్టారు పోలీసులు. భార్య అంగీకారంతో పోస్ట్‌మార్టం (post mortem) నిర్వహించేందుకు యత్నిస్తున్నారు. 

అయితే సుబ్రమణ్యం తల్లిదండ్రులు  మాత్రం పోస్ట్‌మార్టంను వ్యతిరేకిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం జరిగితే తప్ప కేసు ముందుకు కదలని పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా సంతకం చేయిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంతకం పెట్టేందుకు సుబ్రమణ్యం భార్య నిరాకరిస్తోంది. 

Also Read:ఫంక్షన్లలో ఎంజాయ్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. అరెస్ట్‌పై పోలీసులపై మౌనం, విమర్శలు

కాగా.. తన మాజీ డ్రైవర్ మృతి కేసులో (subramanyam dead body) ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు (ysrcp mlc ananthababu) పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన అరెస్ట్ కోసం నిన్నటి నుంచి డ్రైవర్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీపై ఈ స్థాయిలో ఆరోపణలు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని.. అతను ఎక్కడున్నాడో తెలిసి వదిలేస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి డ్రైవర్ సుబ్రమణ్యం చనిపోతే.. శుక్రవారం రెండు పెళ్లిళ్లకు హాజరయ్యారు ఎమ్మెల్సీ అనంత బాబు. పెళ్లిళ్లలో పాల్గొనడమే కాకుండా దర్జాగా ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో (ggh kakinada) ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దళిత ప్రజా సంఘాలు, పలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జీజీహెచ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.  ప్రస్తుతం సుబ్రహ్మణ్యం మృతదేహం ఉన్న కాకినాడ జీజీహెచ్ వద్దకు తెలుగుదేశం పార్టీ (telugu desam party) ఏర్పాటు చేసిన నిజ నిర్దారణ బృందం (fact finding committee)  వెళ్లింది.

Follow Us:
Download App:
  • android
  • ios