ఆంధ్రప్రదేశ్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు. పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ ఈ పరిస్థితే ఉన్నది. ఈ ఎండల తీవ్రత ఇలాగే మరో ఐదారు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సతమతం చేస్తున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ నిన్న గరిష్ట ఉష్ణోగ్రతలు పలు చోట్ల 40 డిగ్రీల మార్క్‌ను దాటేసింది. మరో ఐదారు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే నమోదు అవుతాయని అధికారులు తెలిపారు.
మంగళవారం 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు గుర్తించారు.
మంగళవారం అత్యధికంగా విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో 41.9 డిగ్రీలు నమోదు అయింది. కాగా, రాజాంలో 41.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా అవుకులో 41.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రిపోర్ట్ అయ్యాయి.
తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కారణంగా ప్రజలు బయట తిరగాలంటేనే భయపడుతున్నారు.
Also Read: శృంగారంలో రిస్కీ పొజిషన్ ట్రై చేయడంతో పురుషాంగం ఫ్రాక్చర్.. ఎమర్జెన్సీ సర్జరీ చేసిన వైద్యులు
తెలంగాణలోనూ పలు చోట్ల 41 డిగ్రీలు, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రజలు బయట అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. ఈ ఎండల తీవ్రత మరో ఐదారు రోజులు ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
