కలెక్టర్, డాక్టర్లను విధులు నిర్వహించకుండా దురుసుగా ప్రవర్తించారంటూ నందిగామ పోలీస్టేషన్లో జగన్ పై కేసు నమోదైంది. అయితే, ప్రభుత్వం తనపై దురుద్దేశపూర్వకంగానే కేసు పెట్టింది కాబట్టి సదరు కేసును కొట్టేయాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఇపుడు ఆ కేసులోనే హై కోర్టు జగన్ పిటీషన్ కొట్టేసింది.
హై కోర్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఆమధ్య నందిగామ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన ఘటన గుర్తుంది కదా? ఆ ఘటనకు సంబంధించి మృతుల బంధువులను పరామర్శించేందుకు జగన్ నందిగామ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ డ్రైవర్ మృతదేహం తరలింపు వ్యవహారంలో జగన్, కలెక్టర్, డాక్టర్ మధ్య వివాదం రేగింది. డ్రైవర్ కు పోస్టుమార్టమ్ నిర్వహించకుండానే మృతదేహాన్ని తరలిస్తున్నారంటూ జగన్ డాక్టర్, కలెక్టర్ పై మండిపడ్డారు.
అంతేకాకుండా డాక్టర్ చేతిలో ఉన్న ఇతర మృతదేహాల పోస్టుమార్టమ్ రిపోర్టులను లాక్కున్నారు. దాంతో జగన్-కలెక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది జరిగిన వెంటనే కలెక్టర్, డాక్టర్లను విధులు నిర్వహించకుండా దురుసుగా ప్రవర్తించారంటూ నందిగామ పోలీస్టేషన్లో జగన్ పై కేసు నమోదైంది. అయితే, ప్రభుత్వం తనపై దురుద్దేశపూర్వకంగానే కేసు పెట్టింది కాబట్టి సదరు కేసును కొట్టేయాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఇపుడు ఆ కేసులోనే హై కోర్టు జగన్ పిటీషన్ కొట్టేసింది.
