Asianet News TeluguAsianet News Telugu

గోనె సంచుల వివాదం.. రేషన్ డీలర్లకు హైకోర్టులో ఊరట, ఏపీ సర్కార్‌కు షాక్

రేషన్ డీలర్లకు (ration dealers) ఏపీ హైకోర్టులో (ap high court) ఊరట లభించింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది. దశాబ్దాలుగా కమిషన్‌తో పాటు, గోనె సంచుల ద్వారా రేషన్ డీలర్లు ఆదాయం పొందుతున్నారు. తాజాగా గోనె సంచులుకు డబ్బులు ఇచ్చేది లేదంటూ అధికారులు ఆదేశించారు.

high court shock to ap government
Author
Amaravati, First Published Jan 8, 2022, 6:51 PM IST

రేషన్ డీలర్లకు (ration dealers) ఏపీ హైకోర్టులో (ap high court) ఊరట లభించింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది. దశాబ్దాలుగా కమిషన్‌తో పాటు, గోనె సంచుల ద్వారా రేషన్ డీలర్లు ఆదాయం పొందుతున్నారు. తాజాగా గోనె సంచులుకు డబ్బులు ఇచ్చేది లేదంటూ అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా తాము నష్టపోతామని డీలర్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఏపీ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మండాది వెంకట్రావు, మధు, శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. డీలర్ల తరపున హైకోర్టులో  న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. గోనె సంచుల డబ్బులు రేషన్ డీలర్లకే చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒక్కో సంచికి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చి తీసుకోవాలని‌ ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తీర్పుపై రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు.

కాగా.. గతేడాది రేషన్ డీలర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేషన్ షాపులు బంద్ చేపట్టారు డీలర్లు. 2020 పీఎంజీకేవై (pmgky) కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్కిలస్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని రేషన్ డీలర్లు కోరారు. వీరి నుంచి ఐసీడీఎస్‌కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డీలర్లు డిమాండ్ చేశారు. అలాగే, గోనె సంచులను తిరిగి ప్రభుత్వానికిస్తే రూ.20 చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనని డీలర్లు పట్టుబట్టారు. పక్క రాష్ట్రం తెలంగాణలో (telangana) అది పక్కాగా అమలవుతోందని గుర్తుచేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా నిరసనలు కొనసాగిస్తామన్న రేషన్ డీలర్లను బుజ్జగించేందుకు మంత్రి కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios