ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో బలంగా ఉందని తమిళ సినీనటుడు సూర్య అన్నారు. అందుకే గొప్ప ఆలోచనతో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర  చేపట్టారని ఆయన తెలిపారు.  వైఎస్‌జగన్‌కు కష్టపడేతత్వం ఎక్కువ. పైగా ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎంత దూరమైన వెళ్తారు అని సూర్య పేర్కొన్నారు.

కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచే తనకు  వైఎస్‌ఆర్‌ కుటుంబంతో సన్నిహితముందని సూర్య చెప్పారు. వైఎస్‌ జగన్‌, తాను కలుసుకున్నప్పుడు తమ మధ్య రాజకీయ అంశాల ప్రస్తావన పెద్దగా చర్చకు రావన్నారు. అయినప్పటికీ  ప్రజలకు ఏదో చేయాలన్న బలమైన తపన జగన్‌లో తాను గమనించానన్నారు. మహానేత, దివంగత సీఎం రాజశేఖరరెడ్డిని కోల్పోవడం అందరికీ తీరని లోటని చెప్పారు. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చాలా ప్రాధాన్యం కలిగిందని అభిప్రాయపడ్డారు.  ప్రస్తుతం జగనన్న చేస్తున్న పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ సూర్య ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.