ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ కృష్ణమ్మలో కలుస్తుండటంతో జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఇప్పటి వరకు జలాశయానికి 6.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 8 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 12 గేట్లకు గాను 10 గేట్లను ఎత్తి 6.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.50 అడుగుల నీటి మట్టం వుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా వరదనీరు దిగువకు రావడంతో నాగార్జునసాగర్‌‌లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

ఇన్‌ఫ్లో 5,34,079 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 25,013 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 532.80 అడుగులుగా నమోదైంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 178.66 టీఎంసీలుగా ఉంది. 

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత: 1.04 లక్షల క్యూసెక్కులు సాగర్ కు విడుదల (వీడియో)

తెలుగు రాష్ట్రాల వైపు బిర బిర పరుగులు తీస్తోన్న కృష్ణమ్మ

"