శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేసి 1.04 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం నాడు సాయంత్రం ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు శ్రీశైలం గేట్లు ఎత్తారు.

ఎగువన నుండి భారీగా కృష్ణా నదికి వరద నీరు వస్తున్నందున శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటి మట్టం 878 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.

నాలుగు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు 1.04 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులతోపాటు తుంతభద్ర ప్రాజెక్టు నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు వచ్చింది చేరుతోంది.

భారీ వరదల కారణంగా వస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు.శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో  పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అంతకుముందు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఏపీ మంత్రి అనిల్ కుమార్, తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గేట్లు ఎత్తారు.

వీడియో

"