Asianet News TeluguAsianet News Telugu

కరోనా కట్టడి : జగన్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

అమరావతి : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి విషయంలో ధర్మాసనం ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ లో ధాఖలు చేసిన దానికి, క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కోవిడ్ విధానాలకు పొంతనలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

HC serious on ys jagan government over corona cases - bsb
Author
Hyderabad, First Published May 6, 2021, 12:27 PM IST

అమరావతి : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి విషయంలో ధర్మాసనం ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ లో ధాఖలు చేసిన దానికి, క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కోవిడ్ విధానాలకు పొంతనలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదని నోడల్ అధికారులే బదులివ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పద్ధతి మార్చుకోకుంటే సీఎస్ అఫిడవిట్ ధాఖలు చేయాల్సివస్తుందని హైకోర్టు హెచ్చరించింది. 

కాగా, ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఆస్పత్రుల్లో ఆక్సీజన్ అందక చనిపోతున్న కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. విజయవాడ, కానూరు హాస్పిటల్ లో ఇలాంటి భయానక వాతావరణం నెలకొంది. కరోనా బాధితులకు ఆసుపత్రిలో ఆక్సీజన్ అందించలేకపోవడంతో బాధితుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

ఐసీయూ లో ఉన్న తన తండ్రిని కాపాడుకోవడం కోసం  ఓ కూతురు ఆటోలో ఆక్సిజన్ సిలిండర్ తో ఆసుపత్రికి చేరుకుంది. ఆక్సిజన్ అందించలేని అద్వాన పరిస్థులలో టైమ్ హాస్పిటల్ ఉందంటూ కరోనా బాధిత కుటుంభ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫీజులపై ఉన్న శ్రద్ధ కరోనా బాధితుల పట్ల లేదంటూ ఆవేదన చెందుతున్నారు. 

ఇక మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద.. వైసిపి సిటి కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించాడు. స్థానిక ఆదిత్య హస్పిటల్ వద్ద ఓ మహిళపై ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు లేకుండా ఎవ్వడూ వైద్యం చేయడంటూ వీరంగం సృష్టించాడు.  

డబ్బులు కట్టినా ఆక్సిజన్ లేకపోతే ఎలా అని ప్రశ్నించిన మహిళ పై ఆకుల సీరియస్ అయ్యాడు.నోరు ముయ్యి.. నీ డబ్బులు నీకు పడేస్తాం.. రూపాయికి పది రూపాయిలు పడేస్తానని ఫైర్.. అయ్యాడు. అంతేకాదు ఆదిత్య హాస్పిటల్ నుంచి బాధితుడిని దయచేసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లండంటూ ఉచిత సలహా ఇచ్చాడు. 

ఇక శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ మురళీ కృష్ణ కరోనా కోవిడ్ సోకింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో రోగులకు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారాయన ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేశాడు. డిప్యూటీ తహసీల్దార్ నే పట్టించుకోకుంటే సాధారణ రోగులు పరిస్థితి ఎలా ఉంటోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

Follow Us:
Download App:
  • android
  • ios