Asianet News TeluguAsianet News Telugu

వేల కోట్లు విలువైన ప్రభుత్వ భూమిలో టీడీపీ గుడిసె కట్టిందా..? వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ కార్యాలయాల అంశంపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. జగన్ ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి? అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై వైసీపీ ఏమందంటే..?

Has TDP built a hut on government land worth thousands of crores? YCP strong counter to TDP GVR
Author
First Published Jun 23, 2024, 3:39 PM IST | Last Updated Jun 23, 2024, 3:39 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌ ధన దాహానికి అంతే లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శనివారం ఉదయం 5 గంటల సమయంలో తాడేపల్లిలో జల వనరుల శాఖకు చెందిన స్థలంలో నిర్మిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని తాడేపల్లి-మంగళగిరి మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. కోర్టులో ఈ భవనం అంశం పెండింగ్‌లో ఉండగానే.. టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేతకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. అనుమతుల్లేకుండా నిర్మించడం వల్లే కూల్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.... తమ పార్టీ కార్యాలయం కూల్చివేత ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నామమాత్రపు లీజుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టిందని తెలుగుదేశం పార్టీ మరో అంశాన్ని లేవనెత్తింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒంగోలు మినహా అన్నిచోట్లా అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాలు నిర్మిస్తోందని ఆరోపిస్తోంది అధికార తెలుగుదేశం పార్టీ.

ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. 

‘‘జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో  25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. 
ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? 
నీ ధనదాహానికి అంతులేదా?’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

 

 

దీనిపై వైసీపీ కూడా స్పందించింది.
‘‘మీరు చేస్తే రాజకీయం.. మేము చేస్తే కబ్జానా Telugu Desam Party (TDP)?
రాష్ట్రవ్యాప్తంగా మీ టీడీపీ ఆఫీసులు ప్రభుత్వ స్థలాలు లీజుకి తీసుకుని కట్టలేదా?  
అప్పట్లో ఆ జీవో ఇచ్చింది మీరు కాదా? దాన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు నిర్మించుకున్నది నిజం కాదా?
హైదరాబాద్‌లో పాతికేళ్ల క్రితం ఎన్టీఆర్ భవన్‌కి ఇలానే స్థలంను కేటాయించుకున్న విషయం మీ Nara Chandrababu Naidu మర్చిపోయాడా? 
అదే పని వైయస్‌ఆర్‌సీపీ చేస్తే కబ్జా అంటూ టీడీపీ, ఎల్లో మీడియాలో రెండు రోజులుగా ఈ కపట నాటకాలెందుకు?
మీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు? 
ఈరోజు మీ రాజకీయ కక్షసాదింపు చర్యల్లో భాగంగా ఏకంగా నిర్మాణం పూర్తి కావొచ్చిన మా పార్టీ ఆఫీసులని సైతం కూల్చేస్తున్నారే ఇదే పని మేము అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే ఈరోజు మీకు ఒక్క పార్టీ ఆఫీస్ ఉండేదా…?’’ వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

 

 

‘‘వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని, గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,000 రూపాయలకి లీజుకి తీసుకుని, చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్న పూరి గుడిసె ఇదే! ఈ లీజు ద్వారా, ఈ స్ధలం ఏకంగా 99 సంవత్సరాల పాటు టీడీపీకే సొంతం అనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారు. ఇలాంటి భూములు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాజేసారు.’’ అంటూ మరో ట్వీట్ చేసింది వైసీపీ...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios