Asianet News TeluguAsianet News Telugu

ఈ ఐదేళ్ల జగన్ పాలన ఆంధ్ర ప్రదేశ్ ను ఉద్దరించిందా? అధికారిక లెక్కలేమంటున్నాయి?

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ది, సంక్షేమంపై చర్చ జరుగుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు ఒక్కోరకంగా చెబుతున్నాయి. మరి అధికారిక లెక్కలు ఎలా వున్నాయంటే....

Has Andhra Pradesh developed during Jagan s Governance ? AKP
Author
First Published Apr 6, 2024, 3:28 PM IST

అమరావతి : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నా తెలుగు ప్రజల చూపుమాత్రం ఆంధ్ర ప్రదేశ్ వైపే వుంది. ఎందుకంటే రాబోయే ఐదేళ్లు దేశాన్ని పాలించేవారిని ఎన్నుకునే లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాన్ని పాలించేవారిని ఎన్నుకునే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇలా ఒకేసారి రెండు ఎన్నికలు జరుగుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఎండల కంటే పొలిటికల్ హీటే ఎక్కువగా వుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టిడిపి ఓసారి, వైసిపి ఓసారి అధికారంలోకి వచ్చాయి. దీంతో ఈసారి ఏ పార్టీ బలంగా వుందో ఏ పార్టీ బలహీనంగా వుందో అంచనావేయడం రాజకీయ విశ్లేషకులకు కూడా కష్టంగా మారింది. 

అయితే ప్రస్తుత పాలన, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రజలను కోరుతోంది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బిజెపి లు పొత్తులపై నమ్మకంతో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వుండేందుకు ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అసెంబ్లీ, లోక్ సభ బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే ఇరుపక్షాలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. 

ఈ ఐదేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది ఏమీ జరగలేదని... వైసిపి నాయకులు ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని... ఏ రంగంలోనూ వృద్ది సాధించలేదని ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే వైసిపి సర్కార్ ఈ రాష్ట్రాన్ని ఉద్దరించిందేమీ లేదా? ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయా? అన్నది ప్రజలకు అర్థకావడం లేదు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితితో వివిధ రంగాల గురించి అధికారిక లెక్కలు ఎలా వున్నాయో పరిశీలిద్దాం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశంలోని అన్నిరాష్ట్రాల్లో విద్యావ్యవస్థ, విద్యార్థుల మేదస్సు, శిక్షణా పద్దతులపై అద్యయనం చేసింది. దీని ఆదారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చింది. ఇందులో రెండు రాష్ట్రాలు వెనుకంజలో వున్నాయి. జగన్ సర్కార్ కు కాస్త ఊరటనిచ్చే అంశం ఏమిటంటే సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే ఏపీ విద్యా రంగంలో కాస్త మెరుగ్గానే వుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మొదటిస్థానంలో వుంటే ఆంధ్ర ప్రదేశ్ నాలుగు, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. 
 
విద్యావ్యవస్థ సరిగ్గా లేదంటే ఆటోమేటిక్ అక్కడ నిరుద్యోగం కూడా ఎక్కువగానే వుంటుంది. కాబట్టి  ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగిత రేటు 65 శాతంగా వున్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులోనూ తెలంగాణ 78 శాతంగా వుంది. 

 విద్యావ్యవస్థ సరిగ్గా లేకుండా నిరుద్యోగం ఎక్కువగా వుంటే ఆ సమాజ ప్రగతి కూడా కుంటుపడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే జరుగుతోందని సామాజిక ప్రగతి సూచీని పరిశీలిస్తే అర్థమవుతుంది. కేంద్ర ప్రభత్వం 2023 లో విడుదల చేసిన 'సామాజిక ప్రగతి సూచీ' నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ 23వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల  వారిగా చూసుకున్న ఏపీది నాలుగో స్థానం. 

రోజా పెద్దదా? జగన్ పెద్దోడా? ఈ అన్నా చెల్లి పిలుపులేంటి?

ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తే చాలు... ఎలాంటి సంక్షేమ పథకాల అవసరం వుండదని అంటుంటారు. వీటిని కూడా అభివృద్ది సూచికలుగా పరిగణిస్తారు. కాబట్టి ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటారు.అయితే జగన్ సర్కార్ కూడా ప్రజారోగ్యం కోసం మంచి ప్రయత్నమే చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా సిబ్బందిని నియమించినట్లు... తద్వారా ప్రజలకు మంచి వైద్యం అందుతున్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ విడుదలచేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 

అభివృద్దికి సూచికగా రాష్ట్ర జిఎస్ డిపిని పేర్కొంటారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో జీఎస్ డిపి తక్కువగా వున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఈ విషయం తెలంగాణ మెరుగ్గా వుంది. ఏపీ రూ.13.2 లక్షల కోట్లు జీఎస్ డిపితో దక్షిణాదిన నాలుగో స్థానంలో వుంది. స్వల్ప తేడాతో తెలంగాణ మూడోస్థానంలో వుంది. 

రాష్ట్రంలో ఓ మనిషి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయంగా పేర్కొంటారు. ఈ విషయంలోనూ ఆంధ్ర ప్రదేశ్ దక్షిణాదిన వెనకబడి వుంది. ఏపీ తలసరి ఆదాయం రూ.2,07,771. దక్షిణాదిన గల మిగతా నాలుగు రాష్ట్రాలు ఏపీ కంటే మెరుగైన తలసరి ఆదాయాన్ని కలిగివున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios