రోజా పెద్దదా? జగన్ పెద్దోడా? ఈ అన్నా చెల్లి పిలుపులేంటి?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజా మధ్య ఆత్మీయ పిలుపులు వింటే నిజంగానే వీళ్లిద్దరూ అన్నాచెల్లెల్లా అన్న అనుమానం కలుగుతుంది. వీరిద్దరి మధ్య ఇంత ఆత్మీయత ఎలా ఏర్పడింది? అసలు వీరిలో ఎవరు పెద్దవారు? ఎవరు చిన్నవారు?
YS Jagan Roja
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పర్యాటక మంత్రి ఆర్కె రోజా ఎంతో ఆత్మీయంగా వుంటారు. సీఎంను రోజా సొంత అన్నలా భావిస్తూ జగనన్న అని పిలుస్తుంటుంది... జగన్ కూడా అంతే నా చెల్లెమ్మ రోజా అంటూ వరస కలిసి మాట్లాడుతుంటారు. ఒకే కడుపున పుట్టకపోయినా సొంత అన్నాచెల్లిలా మెలుగుతూ ఒకరిపై ఒకరు చూపించుకునే అభిమానం వైసిపి వాళ్లకే కాదు ఆ పార్టీని అభిమానించే వాళ్లకు చూడముచ్చటగా అనిపిస్తుంటుంది. అయితే వైఎస్ జగన్, రోజా ఒకే వయసు వారిలా కనిపిస్తుంటారు... మరి వీరిద్దరిలో ఎవరు పెద్దవారు? ఎవరు చిన్నవారు? వయసుకు తగినట్లు అన్నాచెల్లి పిలుపులున్నాయా అన్నది ఆసక్తికర అంశం.
roja with ys jagan
నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే రోజాయే పెద్దది. ఇద్దరూ ఒకేఏడాదిలో కేవలం నెలరోజుల తేడాతో జన్మించారు. రోజా 17 నవంబర్ 1972 లో జన్మిస్తే వైఎస్ జగన్ 21 డిసెంబర్ 1972 లో జన్మించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఇద్దరూ రాయలసీమలోనే పుట్టిపెరిగారు. ఇప్పుడు ఒకే పార్టీలో వుంటూ నిజమైన అన్నాచెల్లిలా ఆత్మీయంగా వుంటున్నారు.
YS Jagan Roja
జగన్-రోజా అన్నాచెల్లి వరసల కథేంటి?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసారు. కాంగ్రెస్ ను ఎదిరించి సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ హోదాలో వున్నారు. కాబట్టి ఆయన అందరినీ కలుపుకుపోతూ హుందాగా మెలగాల్సి వుంటుంది. పార్టీ నాయకులు సైతం వయసుతో సబంధం లేకుండా వైఎస్ జగన్ ను గౌరవిస్తూ సార్ అని కొందరు, అన్న అని మరికొందరు పిలుస్తుంటారు.
YS Jagan Roja
అయితే వైసిపిలో చేరినప్పటి నుండి అధినేత జగన్ తో రోజా చనువుగా మెలుగుతున్నారు. ఈ చనువుతోనే తనకంటే చిన్నవాడైనప్పటికీ జగనన్న అని పిలవడం అలవాటయ్యింది. దీంతో జగన్ కూడా రోజాను సొంత చెల్లిలా చూడసాగారు. ఇలా ఇద్దరి మధ్య అత్మీయతే అన్నాచెల్లిని చేసింది.
Roja Chandrababu
గతంలో టిడిపిలో వుండగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సార్ అని సంబోధించేవారు రోజా. చంద్రబాబు రోజాకంటే చాలా పెద్దవారు... సీనియర్ రాజకీయ నాయకుడు కూడా. కానీ వైఎస్ జగన్ తన వయసువాడు... రాజకీయాల్లోనూ సీనియర్ కాదు. ఇదికూడా జగన్ ను సార్ అనకుండా ప్రేమగా అన్న అని రోజా పిలవడానికి కారణమై వుంటుంది.
YS Jagan Roja
రోజా, జగన్ అన్నాచెల్లి అనుబంధంపై సోషల్ మీడియాలో సెటైర్లు :
రోజా తనకంటే చిన్నవాడిని అన్నా అనడం... జగన్ కూడా ఆమెను తన చెల్లెమ్మ అని సంబోధించడంపై ప్రత్యర్థి పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. సొంత చెల్లెల్లకు న్యాయం చేయలేడు కానీ ఎవరినో తీసుకొచ్చి చెల్లెమ్మ అంటూ ప్రేమను వలకబోయడం ఏమిటంటూ ప్రత్యర్థి పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదికూడా తనకంటే పెద్దదైన రోజాను జగన్ చెల్లెమ్మ అనడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
Roja
నగరిలో మళ్లీ రోజాకే అవకాశం :
ఏదేమైనా రోజాకు వైఎస్ జగన్ రాజకీయంగా మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఆమెకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు... ముచ్చటగా మూడోసారి కూడా రోజానే నగరి బరిలో దింపుతున్నారు. అంతేకాదు తన కేబినెట్ లో చోటుకల్పించి మంత్రి కావాలన్న రోజా కలను నిజం చేసారు. ఇలా తనకు రాజకీయంగా అత్యుత్తమ అవకాశాలు ఇచ్చిన నాయకున్ని రోజా అన్న అని సంబోధించడంలో తప్పేముంది అని వైసిపి నాయకులు అంటున్నారు.