ఏపీలో దళితులకు అన్యాయం చేస్తోందని సీఎం జ‌గ‌న్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జ‌గ‌న్ చెల్లెలు కులాంతర వివాహం చేసుకున్నా.. పర్వాలేదు. కానీ, ఇతరులు ప్రేమ వివాహం చేసుకుంటే వారిపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. 

Harsha Kumar :  ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. ఏపీలో దళితులపై వివక్షత కొనసాగుతోందని అన్నారు. శనివారం మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయ‌నీ, అయినా.. జగ‌న్ ప్రభుత్వం ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ఒంగోలుకు చెందిన దళిత అబ్బాయి వినోద్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. రెడ్డి అమ్మాయిలను దళితులు ప్రేమ వివాహం చేసుకోవ‌డం త‌ప్పు అనేలా జగన్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోందని, కులాంతర వివాహ ప్రోత్సాహకం నిలిపివేశారని ఆరోపించారు. 

Read Also:https://telugu.asianetnews.com/andhra-pradesh/chandrababu-serious-comments-on-ys-jagan-r3xypq

జగన్‌ చెల్లెలు కులాంతర వివాహాం చేసుకుంటే ఫర్వాలేదు.. కానీ, ఇతరులు చేసుకుంటే కక్షనా అని ప్రశ్నించారు. కులాంతర వివాహాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఎందుకు నిలిపివేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హర్షకుమార్‌. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తుందని విమ‌ర్శించారు. దళితులను హత్య చేస్తున్నా.. ప్రభుత్వం న్యాయం చేయటం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీలో ఉన్న దళితులంతా సమావేశమయ్యి దళితులపై జరుగుతున్న వివక్షపై ముఖ్యమంత్రిని నిలదీయాలని కోరారు. 

Read also: https://telugu.asianetnews.com/national/india-evacuates-104-people-from-afghanistan-in-special-flight-operation-devi-shakti-r3xvwb

జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. పేద విద్యార్థ‌లకు మెరుగైన విద్య అంద‌స్తున్నమ‌ని గొప్ప‌లు చేప్పే ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కూ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ .. దీక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద చేస్తే బాగుంటుందని హితవు పలికారు. జనసేన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై దశల వారి ఉద్యమం చేపట్టాలని హర్షకుమార్‌ పవన్‌కు సూచించారు. అలాగే.. రాజమండ్రి ఎయిర్ పోర్టుని వైసీపీ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచించటం స‌రికాద‌ని విమ‌ర్శించారు.