విశాఖటప్నం బీచ్ రోడ్డులో అర్థరాత్రి హైడ్రామా నడిచింది. బీచ్‌ రోడ్డులో అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాలను అధికారులు తొలగించారు. సోమవారం అర్థరాత్రి హరికృష్ణ, ఏఎన్‌ఆర్, దాసరి నారాయణరావు విగ్రహాలు తొలగింపునకు పాల్పడటంతో ఉద్రిక్తత తలెత్తింది. 

జీవీఎంసీ జోన్ 2 ఏసీపీ నాయుడు ఆధ్వర్యంలో విగ్రహాలను తొలగించారు. బీచ్‌ రోడ్డులో విగ్రహాల ఏర్పాటుపై నిషేధం ఉంది. గతంలో ఈ విగ్రహాలను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఏర్పాటు చేయగా.. వాటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. బీచ్‌రోడ్డులో విగ్రహాల ఏర్పాటుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.