ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును రాజ్యసభలో బీజేపీ విప్‌గా నియమించినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ హోదాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేయనున్నారు.  

ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు బీజేపీ ప్రాధాన్యతను ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రంలో కిషన్ రెడ్డి (kishan reddy) మంత్రిగా పనిచేస్తుండగా.. ఇటీవలే తెలంగాణకు చెందిన లక్ష్మణ్‌ను (Lakshman) రాజ్యసభకు పంపింది. ఆ తర్వాత కొన్నిరోజులకే ప్రముఖ సినీ రచయిత వీ.విజయేంద్ర ప్రసాద్‌ను (v vijayendra prasad) రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపిక చేసింది కేంద్రం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ (rajya sabha) సభ్యుడు జీవీఎల్ నరసింహారావును (gvl narasimha rao) రాజ్యసభలో బీజేపీ విప్‌గా నియమించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఆయా రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలను సమన్వయం చేసేందుకు పలువురిని విప్‌గా నియమించిన కేంద్రం.. దీనిలో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసేందుకు జీవీఎల్‌ను రాజ్యసభలో బీజేపీ విప్‌గా నియమించినట్లుగా తెలుస్తోంది. ఈ హోదాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేయనున్నారు. 

ALso REad:రుషికొండ రహస్యమేంటీ.. ఎందుకు విపక్షాలను వెళ్లనివ్వడం లేదు: ప్రభుత్వంపై జీవీఎల్ విమర్శలు

అంతకుముందు జూలై 11న జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నొక్కే బటన్‌కు బ్యాటరీ ఇచ్చేది కేంద్రమేనన్నారు. కేంద్రం నుంచి ఆర్ధిక సాయం చేయకపోతే బటన్ పనిచేసేది కాదంటూ జీవీఎల్ దుయ్యబట్టారు. మోడీకి పేరు రావడం ఇష్టం లేకే ఉచిత బియ్యం పంపిణీని జగన్ సర్కార్ నిలిపివేసిందని నరసింహారావు ఆరోపించారు.