గుంటూరు:గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  పట్ల ఓ అధికారి అవమానకరంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ప్రోటోకాల్ ను కూడ పట్టించుకోకుండా ఆ అధికారి వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు తన విషయంలో  కూడ ఆ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై గల్లా జయదేవ్ అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. ఇదే విషయమై ఆ అధికారితో మాట్లాడేందుకు వెళ్లిన గల్లా జయదేవ్ కు రెండోసారి కూడ అవమానం ఎదురైంది.

తల దించుకొని తన పని తాను చేసుకొంటూ కనీసం ఎంపీతో మాట్లాడేందుకు కూడ ఆ అధికారి ఇష్టం చూపలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రజా ప్రతినిధికి తగిన గౌరవం ఇవ్వకపోవడంతో ఇక నుండైనా తన పంథాను మార్చుకోవాలని ఎంపీ గల్లా జయదేవ్ ఆ అధికారిని హెచ్చరించారని సమాచారం.

గుంటూరులో జరుగుతున్న కార్యక్రమాలకు తనకు కానీ, తమ పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడాన్ని జయదేవ్  తప్పుబట్టారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న విషయాన్ని కూడ ఎంపీ జయదేవ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.   అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదేశాలను ఈ అధికారి పాటిస్తున్నారని టీడీపీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి.