తనమీద కోపంతోనే గుడివాడ మండలంలో రోడ్లేయడం లేదని వైసిపి ఎమ్మెల్య కొడాలి టిిడిపి ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల లో అభివృద్ధి జరగమే లేదని, గత మూడు సంవత్సరాల నుండి గుడివాడ నియోజకవర్గం లో ఉన్న వలివర్తపాడు ,మల్లయాపాలెం ,బొమ్ములూరు, బిళ్ళపాడు గ్రామాలు అభివృద్ధి కి నోచుకోవటం ఎమ్మెల్యే కొడాలి నాని కోపంగా ఉన్నారు.
నెల రోజులలో ఈ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే అన్ని గ్రామాల ప్రజలతో మహా ధర్నా చేపడతామని కొడాలి నాని హెచ్చరించారు.
గుడివాడ రూరల్ మండలం వలివర్తపాడు గ్రామానికి సరైన రహదారి లేదని ఈ రోజు గ్రామస్తులు అందరూ బైపాస్ రోడ్డు మీద ధర్నాకి దిగారు.వారికి నాని మద్దతు పలికి వారితో పాటు రోడ్డు మీద బైటాయించి నిరసన తెలిపారు
అనంతరం మీడియా తో మాట్లాడుతూ గుడివాడ పట్టణానికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న వలివర్తిపాడు రహదారి లేక ఉన్నది మొత్తం గుంటలు పడి ఉండటంతో పలు సరిగా లేకపోవడం గ్రామస్తులు కష్టాలు పడుతున్నారని ఆయన చెప్పారు. జిల్లాపరిషత్ చైర్మన్ కి తెలుగుదేశం నాయకులకి ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడం లేదని అంటూ హాస్పిటల్ కి వెళ్ళాలన్నా రోడ్డు సరిగ్గా లేక అంబులెన్స్ కూడా రావట్లేదు నాని అన్నారు. ఇక్కడి ప్రజలు వై యస్ అర్ పార్టీ కి కొడాలి నానికి మద్దతు పలుకుతున్నారనే నేపంతో రహదారి నిర్మించటం లేదని ఆయన అగ్రహాం వ్యక్తం చేశారు. రాజకీయాలు మాని జిల్లా పరిషత్తు నిధులనుండి కాని రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని మంజూరు చేసి రహదారి నిర్మంచాలి. లేక పోతే, మహా ధర్నా చేస్తామని చెప్పారు. (వీడియో కర్టసీ ఎవిఎజెఎ)
మరిన్ని వార్తల ఇక్కడ చదవండి
