ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో అవకాశం దక్కనివారిని మరో రకంగా సంతృప్తి పరుస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా కొడాలి నానికి ఛాన్స్ ఇచ్చారు.
మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) అధికార వైసీపీలో (ysrcp) అసంతృప్తి సెగలు రేపుతోంది. జాబితాలో పేరుంటుందని చివరి వరకు ఆశించిన వారికి అధిష్టానం షాక్ ఇవ్వడంతో వారు నిరాశకు గురవుతున్నారు. ఇదే సమయంలో వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. పాత, కొత్త కలయికతో కేబినెట్ కూర్పు చేసిన సీఎం జగన్.. మంత్రి వర్గంలో చోటు దక్కని నేతలకు కీలకమైన పదవి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు (ap state development board ) ఛైర్మన్‌గా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి (kodali nani) ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. అలాగే చీఫ్ విప్‌గా ప్రసాదరాజు (prasada raju), డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి (kolagatla veerabhadra swamy), ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణులకు (malladi vishnu) చోటు కల్పించారు జగన్ (ys jagan). సామాజిక వర్గాల వారీగా బీసీ 10, కాపు 4, రెడ్డి 4, ఎస్సీ 5, ఎస్టీ 1, మైనార్టీ 1లకు కల్పించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌లో కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్ ఫైనల్ చేశారు. ఈ మేరకు మీడియాకు అధికారికంగా విడుదల చేశారు. 25 మందితో కొత్త టీమ్‌ను జగన్ ఎంపిక చేశారు.
ఏపీ సీఎం కొత్త టీమ్ ఇదే
1.ధర్మాన ప్రసాదరావు,
2.సీదిరి అప్పలరాజు
3.బొత్స సత్యనారాయణ
4.గుడివాడ అమర్ నాథ్
5.సి. రాజన్నదొర
6.తాడిశెట్టి రాజా
7.చెల్లుబోయిన వేణుగోపాల్
8.బూడి ముత్యాలనాయుడు
9.నారాయణస్వామి
10.ఉషశ్రీచరణ్
11.విశ్వరూప్
12.జోగి రమేష్
13.అంబటి రాంబాబు
14.మేరుగ నాగార్జున
15.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
16.పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి
17.కారుమూరి నాగేశ్వరరావు
18.కొట్టు సత్యనారాయణ
19.కళావతి
20.అంజద్ భాషా
21.తానేటి వనిత
22.గుమ్మనూరు జయరాం
23.తిప్పేస్వామి
24. ఆర్. కే. రోజా
