Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియానే దిక్కు

ఐటి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి నారాలోకేష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా 20 మంది పనిచేస్తారు. అందుకు రూ. 8 కోట్లు మంజూరు కూడా చేసింది. ఇన్ని కోట్లరూపాయలు మంజూరు చేసిందంటేనే ఎంత భారీ స్ధాయిలో సోషల్ మీడియాను నిర్వహించాలనుకుంటోందో అర్ధమైపోతోంది.

Govt to setup Special social media wing for more publicity

చంద్రబాబునాయుడుకు సోషల్ మీడియానే దిక్కైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున సోషల్ మీడియా నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతకాలమూ సోషల్ మీడియాను నియంత్రించాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన చంద్రబాబు సాధ్యం కాకపోవటంతో చేతులెత్తేసారు. తనతో పాటు మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో వస్తున్న వ్యంగ్యాస్త్రాలు, విమర్శలను చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ తట్టుకోలేకపోయారు. అందులో భాగంగానే పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్ర లను అరెస్టు చేసింది. దాంతో ప్రభుత్వ చర్యపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు మొదలయ్యాయి. దాంతో ఏం చేయాలో దిక్కు తోచలేదు.

మెజారీటి మీడియా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నా చంద్రబాబుకు అది చాలలేదు. వాస్తవాలను చంద్రబాబు అనుకూల మీడియా వెలుగులోకి రానీయటం లేదన్నది జనాల అభిప్రాయం. దాంతో ప్రధానమీడియా పోషించాల్సిన ప్రతిపక్ష పాత్రను సోషల్ మీడియా పోషిస్తోంది. అందుకే సోషల్ మీడియాకు జనాధరణ విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో చంద్రబాబులో కలవరమూ పెరిగిపోతోంది. ఎన్నికలు చూస్తే దగ్గ పడుతోంది. ప్రచారమేమో పూర్తి వ్యతిరేకం. ఈదశలో ఏం చేయాలో తర్జనభర్జన పడి చివరకు తాము కూడా సోషల్ మీడియానే ఆశ్రయించాలని నిర్ణయించారు.  

ఐటి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి నారాలోకేష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా 20 మంది పనిచేస్తారు. అందుకు రూ. 8 కోట్లు మంజూరు కూడా చేసింది. ఇన్ని కోట్లరూపాయలు మంజూరు చేసిందంటేనే ఎంత భారీ స్ధాయిలో సోషల్ మీడియాను నిర్వహించాలనుకుంటోందో అర్ధమైపోతోంది. ప్రభుత్వ పథకాలకు భారీ ప్రచారం చేయటంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే ప్రత్యేకవింగ్ లక్ష్యమట. అంటే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం చంద్రబాబును ఎంతగా కలవరపరుస్తోందో అర్ధమైపోతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios