కొంత కాలంగా ఐవైఆర్ వ్యవహారశైలిపై చంద్రబాబు అసంతృప్తిలో ఉన్నారన్న వార్తలు షికార్టు చేస్తున్నాయ్. అదే విధంగా ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ ను కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఐవైఆర్ కృష్ణారావుపై వేటు పడింది. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను ఫేస్ బుక్ లో షేర్ చేసారన్నది ఆయనపై అభియోగం. వైసీపీ సానుభూతిపరుడైన రవికిరణ్ చంద్రబాబునాయుడు, లోకేష్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టింగులను ఐవైఆర్ షేర్ చేసారు. దాంతో పలువురు ఛైర్మన్ వ్యవహారంపై మండిపడుతూనే చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు కూడా చేసారు.
అదేసమయంలో కొంత కాలంగా ఐవైఆర్ వ్యవహారశైలిపై చంద్రబాబు అసంతృప్తిలో ఉన్నారన్న వార్తలు షికార్టు చేస్తున్నాయ్. అదే విధంగా ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ ను కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగ ఇటు ఐవైఆర్ ను తప్పించి, అటు పరకాలకు ఛైర్మన్ పదవి ఇస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఐవైఆర్ వివాదం మొదలైంది. దాంతో ప్రభుత్వం ఈరోజు ఐవైఆర్ పై వేటు వేసింది.
