నిరుద్యోగులకు శుభవార్త

Govt extended age limit for employment
Highlights

  • నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త వినిపించింది.

నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత వయో పరిమితిని 42 ఏళ్ళను మరో ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించింది. తాజా నిర్ణయం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ అమల్లో ఉంటుంది. ఈమేరకు జీవో 182 జారీ చేసింది. 2014లో ప్రభుత్వ ఉద్యోగానికి వయోపరిమితి 34 ఏళ్ళుండేది. అప్పట్లో అవసరాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబునాయుడు 42 ఏళ్ళకు పెంచారు. అయితే, వయో పరిమితిని పెంచిన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో మాత్రం చొరవ చూపలేదు. దాంతో నిరుద్యోగుల్లో నిరాశపెరిగిపోయింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా ? ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందుకనే వయో పరిమితిని కూడా పెంచాలంటూ అన్నీ వైపుల నుండి డిమాండ్లు మొదలయ్యాయి. దాంతో భవిష్యత్తులో వచ్చే ప్రతీ నోటిఫికేషన్ కు జీవో 182 వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

loader