Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం మరో తుగ్లక్ నిర్ణయం

  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నది.
  • పిల్లలకు బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు విరాళాలు సేకరించే బాధ్యతను మోపింది. తాజాగా జారి అయిన ఆదేశాలతో ఉపాధ్యాయులు నివ్వెరపోతున్నారు.
  • రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో కొత్తగా ‘అమ్మకు వందనం’  అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.
  • ఆ కార్యక్రమం కోసమే విరాళాలు సేకరించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేసింది.
Govt directed teachers to rise funds for a programmme

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నది. పిల్లలకు బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు విరాళాలు సేకరించే బాధ్యతను మోపింది. తాజాగా జారి అయిన ఆదేశాలతో ఉపాధ్యాయులు నివ్వెరపోతున్నారు. ఇంతకీ జరిగిందేంటంటే, రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో కొత్తగా ‘అమ్మకు వందనం’  అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమం కోసమే విరాళాలు సేకరించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేసింది. దసరా సెలవులకు ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలట. కార్యక్రమం ఎప్పుడు మొదలుపెట్టేది త్వరలో ప్రకటిస్తeమని చెప్పటం విచిత్రం. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఈ కార్యక్రమానికి రూ.2.5 కోట్లు అవసరమట. ప్రభుత్వం తరఫున రూ.1.25 కోట్లు విడుదల చేస్తారు. అంటే మిగిలిన ఖర్చును హెడ్మాస్టర్లు, టీచర్లు విరాళాల రూపంలో సమీకరించుకోవాలని సూచించారు. పాఠశాలల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు మొదలయ్యాయి. ప్రజల నుంచి విరాళాలు తీసుకోవాలని చెప్పడం సిగ్గుచేటని విద్యారంగ నిపుణులు కుడా మండిపడుతున్నారు.  

కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నిర్ణయించటమేంటో, అందుకయ్యే ఖర్చును విరాళాల రూపంలో వసూలు చేయాలని చెప్పటమేంటో అర్ధం కావటం లేదు. అసలు ఇటువంటి కార్యక్రమాలను పెట్టమని ఎవరడిగారు? గతంలో కుడా అమరావతి నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.10 తక్కువ కాకుండా విరాళం తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించిన సంగతి గుర్తుంది కదా. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఉత్తర్వుతను ఉపసంహరించుకున్నది లేండి. అయితే, తాజాగా అటువంటి ఉత్తర్వులనే జారీ చేయటం విమర్శలకు దారితీస్తోంది.               

 

Follow Us:
Download App:
  • android
  • ios