Asianet News TeluguAsianet News Telugu

దొడ్డిదారిలో ఛైర్మన్ గా నియమించారు

రాంబాబుతో పాటు వైస్ ఛైర్మన్ నళినీకాంత్ ఇద్దరినీ బలవంతంగా రాజీనామలు చేయించారు.ఎక్కడైనా ఎన్నిక ద్వారానే ఛైర్మన్ను నియమిస్తారు. కానీ ఇక్కడున్నది చంద్రబాబు సర్కార్ కదా? అందుకనే ఓటింగ్ నిర్వహిస్తే నవీన్ కుమార్ ఓడిపోతారన్న భయంతో దొడ్డిదారిలో ఉత్తర్వులిప్పించి ఛైర్మన్ గా నియమించారు.

Govt appointed Navainkumar as zp  chairman with a GO

రాను రాను చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేష్టలు విచిత్రంగా తయారౌతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ నియామకమే ఉదాహరణ.  ప్రజా ప్రతినిధుల ద్వారా ఎన్నికవ్వాల్సిన జడ్పీ ఛైర్మన్ పదవిని ఓ ఉత్తర్వు ద్వారా నియమించటం విచిత్రం. ఇంతకీ జరిగిందేంటంటే, తూర్పు గోదావరి జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబును పదవిలోనుండి తప్పించాలని చంద్రబాబు అనుకున్నారు. తప్పుకోవటానికి రాంబాబు అంగీకరించలేదు. రాంబాబుకు సుమారు 24 మంది జడ్పీటీసీలు మద్దతు నిలవటంతో ఏం చేయాలో తోచలేదు.

ఇంతకీ రాంబాబును ఎందుకు తొలగించాలని అనుకున్నారు? వైసీపీ తరపున గెలిచిన జ్యోతుల నెహ్రూకు మంత్రిపదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ ఫిరాయిస్తే తనకేంటని నెహ్రూ అడిగారు. మంత్రి పదవి ఇస్తానని సహజశైలిలో హామీ ఇచ్చారు. దాంతో నెహ్రూ టిడిపిలోకి దూకేసారు. నెహ్రూ అయితే, టిడిపిలోకి దూకారు కానీ చంద్రబాబు మాత్రం మంత్రిపదవి ఇవ్వలేదు. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏ అలిగారు. ఆయన్ను బుజ్జగించేందుకు నెహ్రూ కొడుకైన జడ్పీటిసి నవీన్ కుమార్ ను జడ్పీ ఛైర్మన్ చేస్తానంటూ హామీ ఇచ్చారు.

అది ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడైతే రాంబాబును తప్పించి నవీన్ ను జడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలని అనుకున్నారో రాంబాబుతో పాటు జడ్పీటీసీలందరూ చంద్రబాబుకు ఎదురుతిరిగారు. మంత్రులతో రాయబారాలు పంపినా ఉపయోగం కనబడలేదు. ‘అవసరమైతే పార్టీని వదిలిపెడతాం కానీ నవీన్ ను మాత్రం జడ్పీఛైర్మన్ గా అంగీకరించేది లేద’ని స్పష్టం చేసారు. దాంతో సజావుగా అయితే నవీన్ ఛైర్మన్ అవటం సాధ్యం కాదన్న విషయం చంద్రబాబుకు అర్ధమైపోయింది.

అందుకనే సోమవారం రాంబాబుతో పాటు వైస్ ఛైర్మన్ నళినీకాంత్ ఇద్దరినీ బలవంతంగా రాజీనామలు చేయించారు. ఎప్పుడైతే వారిద్దరి నుండి రాజీనామాలు తీసుకున్నారో వెంటనే ఆ రెండు పోస్టులు ఖళీగా ఉన్నాయని కలెక్టర్ ద్వారా ఓ నివేదిక తెప్పించుకున్నారు. వెంటనే నవీన్ కుమార్ ను ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసేసింది. ఎక్కడైనా ఎన్నిక ద్వారానే ఛైర్మన్ను నియమిస్తారు. కానీ ఇక్కడున్నది చంద్రబాబు సర్కార్ కదా? అందుకనే ఓటింగ్ నిర్వహిస్తే నవీన్ కుమార్ ఓడిపోతారన్న భయంతో దొడ్డిదారిలో ఉత్తర్వులిప్పించి ఛైర్మన్ గా నియమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios