సాగుభూములను ప్రభత్వం బాబాకు అప్పగించేసిన విషయం తెలుసుకున్న రైతులు భూములు అప్పగించేందుకు నిరాకరించారు. దాంతో పతంజలి సంస్ధకు చెందిన వారు భూముల్లో జెండాలు పాతేసారు. విచిత్రమేమిటంటే రైతుల భూముల పక్కనే టిడిపి నేతల భూములున్నా అవిమాత్రం సేఫే.

పతంజలి రాందేవ్ బాబా కన్ను ఉత్తరాంధ్రలోని భూములపై పడింది. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలలోని ఐదు గ్రామాల్లోని పొలాలు పతంజలి ఆయుర్వేద సంస్దకు కట్టబెట్టేసింది. కొత్తవలస మండలంలోని చినరావుపల్లి, పెదరావుపల్లి, కాటపల్లి, గొల్లపేట, భీమాళి గ్రామాల్లోని పచ్చని పంట పొలాలను ప్రభుత్వం పతంజలికి దారపోసింది. రాష్ట్రంలో పంతజలి ఆయుర్వేద మందుల తయారీ యూనిట్ పెట్టాలని రాందేవ్ బాబా అనుకున్నారు. అంతటి బాబా అనుకున్న తర్వాత ఎవరి భూములైనా ఆయనపరం కావాల్సిందే కదా? చంద్రబాబనాయుడుకు బాబాకు బాగా సన్నిహితుడు కూడాను.

అంతటి శక్తమంతుడైన బాబాను గ్రామస్తులు ఏం చేయగలరు? అసలు తమ భూములను ప్రభుత్వం బాబాకు కట్టబెట్టేసిన విషయం కూడా గ్రామస్తులకు తెలీదు. సుమారు 140 ఎకరాల్లో గ్రామస్తులు 40 ఏళ్ళుగా మామిడి, జీడిమామిడి తోటలను సాగు చేసుకుంటున్నారు. మామిడి తాండ్ర తయారీకీ పై గ్రామాలు బాగా ప్రసిద్ది. ఆ గ్రామాల్లో దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న పొలాలపైనే బాబా కన్ను ఎందుకు పడిందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ప్రస్తుత మార్కెట్ ధర ఎకరాకు రూ. 75 లక్షలు పలుకుతోంది. అంతటి ఖరీదైన భూములను ప్రభుత్వం బాబాకు రూ. 2.5 లక్షలకే అప్పగించేసింది. ఈ భూముల్లో చాలా వరకూ ప్రభుత్వానివనటంలో సందేహం లేదు. అయితే, రైతులంతా గడచిన 40 ఏళ్ళుగా సాగుచేసుకుంటున్న విషయం గుర్తుంచుకోవాలి. సాగుభూములను ప్రభత్వం బాబాకు అప్పగించేసిన విషయం తెలుసుకున్న రైతులు భూములు అప్పగించేందుకు నిరాకరించారు. దాంతో పతంజలి సంస్ధకు చెందిన వారు భూముల్లో జెండాలు పాతేసారు. విచిత్రమేమిటంటే రైతుల భూముల పక్కనే టిడిపి నేతల భూములున్నా అవిమాత్రం సేఫే. చంద్రబాబా మజాకానా?