28 లక్షల బోగస్ కనెక్షన్లా ?

28 లక్షల బోగస్ కనెక్షన్లా ?

రాష్ట్రంలో సుమారు 28 లక్షల బోగస్ గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం తొలగించింది. అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయిచింది. అందులో భాగంగానే ముందు బోగస్ కనెక్షన్లను తొలగించాలని భావించింది. ఎందుకంటే, దేశవ్యాప్తంగా బోగస్ కనెక్షన్లు ఎక్కవవుతున్నట్లు విపరీతంగా ఫిర్యాదులొస్తున్నాయి. ఒకే ఇంటిలో ఒకటికన్నా ఎక్కువ కనెక్షన్లు తీసుకోవటం వాటిని వాణిజ్యావసరాలకు వాడుకోవటం ఎక్కువైపోతోంది.

ఏ రెస్టారెంట్లు, హోటళ్ళు, చివరకు చిన్న చిన్న టీ బంకుల్లో చూసినా ఇళ్ళల్లో వాడాల్సిన గ్యాస్ సిలిండర్లే కనబడుతున్నాయి. ఇళ్ళకని మంజూరు చేసిన గ్యాస్ సిలండర్లను వాణిజ్యావసరాలకు వాడుకోవటం పూర్తిగా నేరం. అందుకనే గ్యాస్ కనెక్షన్ల దుర్వినియోగంపైన ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం ముందుగా బోగస్ కనెక్షన్లను ఏరేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ తో లింక్ పెట్టాలని కండీషన్ పెట్టింది.

ఎప్పుడైతే గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ తో లింక్ పెట్టారో బోగస్ కనెక్షన్లు బయటపడటం మొదలుపెట్టయి. ఎందుకంటే, గ్యాస్ సబ్సిడీ నేరుగా వినియోగదారలకు కాకుండా బ్యాంకుల్లో జమ చేస్తున్నారు కాబట్టి  బోగస్ వి బయటపడుతున్నాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 3.77 కోట్ల బోగస్ కనెక్షన్లు బయటపడ్డాయి. వీటిల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 55.87 లక్షలు, మహారాష్ట్రలో 36.15 లక్షలున్నాయి. తర్వాత స్ధానం 28.72 లక్షలతో ఏపిది మూడో స్ధానం. 2015 నుండి ఏపిలో 21.87 లక్షల దీపం కనెక్షన్లు ఇచ్చారు. కనెక్షన్ కోసం వచ్చిన 33.32 లక్షల దరఖాస్తుల్లో 10 లక్షల దరఖాస్తులను అనర్హులుగా గుర్తించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos