ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల ప్రధానాధికారి రామేష్ కుమార్ నిన్నగడ్డ ఈ విషయాన్నీ వెల్లడించారు. 

ఇక ఆతరువాత వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను వాయిదావేయడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన గవర్నర్ ని కూడా కలిసి ఎన్నికల అధికారిపై ఫిర్యాదు చేసారు. 

Also read: అబ్బబ్బబ్బబ్బా... రోజా ఆంటీ డబల్ యాక్షన్: రివర్స్ గేర్ పై బొండా ఉమ

వైసీపీ శ్రేణులన్నీ కూడా జగన్ కు మద్దతుగా రమేష్ కుమార్ ని టార్గెట్ గా చేసి ఆయనది, చంద్రబాబుది ఒకటే కులం కావడం వల్ల ఇలా చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 

దీనిపై టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ వారికి బలంగానే కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ ను టార్గెట్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఒక పంచ్ వేశారు. 

Also read: నిమ్మగడ్డ రియల్ హీరో, జగన్ కమ్మలపై పడ్డారు: బైరెడ్డి సెటైర్లు

జగన్ కు ఎన్నికల కమీషనర్ మీద కోపం రావడానికి ఆయన ఇంటిపేరు ఎందుకు కారణమయ్యిందో అనే రీతిలో వ్యంగ్యంగా ట్వీట్ చేసారు బుచ్చయ్య చౌదరి. ఆయన జగన్ ను చాలా సార్లు తన సోషల్ మీడియా ఖాతాలో జలగం అని సంబోధిస్తుంటారు.

"అదేంటో ఈ నిమ్మ "గడ్డ" ల పేర్లు వింటుంటే మన జలగం కి ఎక్కడో గడ్డ కడుతుంది... పారాసెటమాల్ వాడితే మంచిదేమో.." అని ట్వీట్ చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారాన్ని ఇక్కడ గుర్తు చేసారు బుచ్చయ్య చౌదరి. ఆయన అక్కడితో ఆగకుండా పారాసిటమాల్ టాబ్లెట్ ని కూడా వ్యంగ్యంగా ఇక్కడ నొక్కి చెప్పడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 

చాలా మంది కింద తమ క్రియేటివిటీకి పని చెబుతూ... జగన్ పారాసిటమాల్ మీద అనేక మీమ్స్ కూడా షేర్ చేసారు.