Asianet News TeluguAsianet News Telugu

అబ్బబ్బబ్బబ్బా... రోజా ఆంటీ డబల్ యాక్షన్: రివర్స్ గేర్ పై బొండా ఉమ

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా ఆంటీ అంటూ సంబోధించి ఆమె మాట మార్చిన వైనంపై ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.

Bonda Uma comments on Roja in twitter
Author
Vijayawada, First Published Mar 16, 2020, 5:20 PM IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత బొండా ఉమామహేశ్వర రావు వైఎస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అబ్బబ్బబ్బా... రోజా ఆంటీ డబల్ యాక్షన్ అంటూ ఇలాంటి పర్ఫార్మెన్స్... నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ అఫ్టర్ అని వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రోజా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు. తన ట్విట్టర్ వ్యాఖ్యలకు రోజా మాట్లాడిన టీవీ చానెల్ దృశ్యాలను జత చేశారు. అరగంటలోనే రోజా మాట మార్చారంటూ ఓ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను తొలుత సమర్థించిన రోజా ఆ తర్వాత మాట మార్చారు. దీంతో అరగంటలోనే రోజా నాలుక మడతపెట్టారంటూ ఆ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. 

ఈ రెండు సందర్భాల్లో రోజా చేసిన వ్యాఖ్యలను చూపిస్తూ ఆ టీవీ చానెల్ కామెంట్ చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేసిందని ఆమె తొలుత చెప్పారు. ఎన్నికలకు భయపడే వైసీపీ వాయిదా వేయించిందని అచ్చెన్నాయుడు, మరెవరో మాట్లాడడం గమనించానని అంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ఒళ్లు పెరిగిందే గానీ బుద్ధి పెరగలేదని అసెంబ్లీలో అనేక మార్లు అన్న విషయం అందరికీ నిజమని తేలిందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు ఒక దగ్గర గుమికూడితే ప్రమాదమని చెప్పి ఈసీ ఎన్నికలను వాయిదా వేసిందని రోజా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవిస్తున్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. కరోనా ఎంత భయంకరంగా ఉందో ఆమె వివరించారు. స్కూల్స్ కు సెలవు ఇచ్చారని, షాపింగ్ మాల్స్ మూసేశారని ఆమె చెప్పారు.  

ఆ తర్వాత రోజా తన మాట మార్చారు. రిటైర్ అయిపోయిన వ్యక్తిని చంద్రబాబు ఈసీగా నియమించారని ఆమె విమర్శించారు. ఓటమి భయంతో తన మనిషితో చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయించారని ఆమె ఆరోపించారు. సీఎంతో గానీ ఉన్నతాధికారులతో గానీ చర్చించకుండా అంతా తానే అయినట్లు ఈసీ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారని ఆమె విమర్శించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios