ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఎందుకు ఆధరణ పెరగటం లేదని చంద్రబాబునాయుడు కూడా వర్రీ అవుతున్నారు.

రాష్ట్రంలో వైసీపీ బలం పెరుగుతోంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు సర్వేలు చేయించటంలో విశ్వసనీయత కలిగిన పార్లమెంట్ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్. వివిధ అంశాల ఆధారంగా సర్వే చేయించటంలో లగడపాటికి మంచి పేరే ఉంది. గతంలో ఆయన చేసిన ఎన్నో సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలకు బాగా దగ్గరగా ఉండటమే నిదర్శనం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని రూరల్ ఏరియాల్లో వైసీపీ బలం బాగా పెరిగిందన్నారు. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ-టిడపిలకు సమానబలముందన్నారు.

లగడపాటి విడుదల చేసిన వివరాలు ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకు సంతోషం కలిగించేదే. మరోవైపు టిడిపి వర్గాలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఎందుకు ఆధరణ పెరగటం లేదని చంద్రబాబునాయుడు కూడా వర్రీ అవుతున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు సక్రమంగా పనిచేయటం లేదని పలు సందర్భాల్లో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంటే, చంద్రబాబు అసహనానికి, లగడపాటి వెల్లడించిన వివరాలకు సరిపోతోంది కదా?

దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజా మద్దతు ఎవరివైపు ఉంటుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఎన్నికలు సమీపించేకొద్దీ టిడిపి పరిస్ధితి మరింత అధ్వాన్నమవుతుందే తప్ప మెరుగయ్యే పరిస్ధితులు అయితే కనబడటం లేదు. రాబోయే రోజుల్లో టిడిపి పట్టణ ప్రాంతాల్లో కూడా టిడిపి పట్టుకోల్పోతుందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.