మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో నెంబర్ 39 ద్వారా ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. 

మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని వారికి 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది. కానీ ఈ సదుపాయం ఔట్ సోర్సింగ్‌లో వున్న ఉద్యోగులకు మాత్రం లేదు. ఈ నేపథ్యంలో వారి విజ్ఞప్తి మేరకు సీఎం సానుకూలంగా స్పందించారు. జీవో నెంబర్ 39 ద్వారా ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.