విశాఖలోని (visakhapatnam) రిఫైనరీ ప్రాజెక్టును (vishaka refinery) రూ.26,264 కోట్లతో ఆధునీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందని కేంద్రమంత్రి రామేశ్వర్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు (ap govt) కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖలోని (visakhapatnam) రిఫైనరీ ప్రాజెక్టును (vishaka refinery) రూ.26,264 కోట్లతో ఆధునీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (gvl narasimha rao) అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ సమాధానం ఇచ్చారు. ఇందుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) (hindustan petroleum corporation limited) అంగీకారం తెలిపిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందని రామేశ్వర్ తెలిపారు.

ఈ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరతాయని, విశాఖ రిఫైనరీ ఆధునీకరణ కోసం స్థానిక ఉత్పత్తులనే ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాగా హెచ్‌పీసీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో ఆధునీకరణ, విస్తరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం నిర్ణయంంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లక్షల మందికి జీవనోపాధి కలుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధికి, పన్నుల రూపంలో ఆదాయానికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని జీవీఎల్ పేర్కొన్నారు.