Asianet News TeluguAsianet News Telugu

పల్నాడు రెంటపాళ్ల యూనియన్ బ్యాంకులో రూ. 2 కోట్ల బంగారం మాయం: ముగ్గురిపై కేసు

పల్నాడు జిల్లాలోని  రెంటపాళ్ల యూనియన్ బ్యాంకులో రూ. 2 కోట్ల స్కాం జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు  సంబంధించి ముగ్గురిపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.

Gold stolen from Union bank in  Sattenapalli
Author
First Published Jan 29, 2023, 10:19 AM IST

గుంటూరు: పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల యూనియన్ బ్యాంకులో   రూ. 2 కోట్ల స్కాం ను  అధికారులు గుర్తించారు.  ఈ ఘటనపై   ముగ్గురు బ్యాంకు సిబ్బందిపై  పోలీసులు  కేసు నమోదు చేశారు.  ఖాతాదారుల బంగారాన్ని మార్చి నకిలీ బంగారాన్ని  బ్యాంకులో  ఉంచినట్టుగా అధికారులు గుర్తించారు.  

బ్యాంకులో  స్కామ్  వెలుగు చూడడంతో   ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.   అవసరం కోసం  తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు సిబ్బంది మాయం చేశారు.  అప్పును చెల్లించినా కూడా  బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో  ఖాతాదారులు  బ్యాంకు అధికారులపై పోలీసులకు  పిర్యాదు  చేశారుఈ ఫిర్యాదు  ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తే  అసలు విషయం వెలుగు చూసింది. 

ఖాతాదారుల బంగారాన్ని మాయమైన విషయాన్ని అధికారులు  సీరియస్ గా తీసుకున్నారు.   బ్యాంకు మేనేజర్  రాంబాబు నాయక్, అసిస్టెంట్ మేనేజర్  రవికుమార్ లపై బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ను  సస్పెండ్  చేశారు.  ఖాతాదారులు  తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారులకు అప్పగించడమే తన విధిగా అప్రైయిజర్  సంపత్ కుమార్ చెబుతున్నారు. 

బ్యాంకులో  బంగారం తాకట్టు పెట్టి   అప్పు తీసుకున్న ఖాతాదారులు.  అప్పు చెల్లించినా  కూడా బంంగారం తిరగి చెల్లించకపోవడంతో  ఖాతాదారులకు  అనుమానం వచ్చింది.  ఈ విషయమై బ్యాంకు అధికారులను నిలదీశారు. అయినా కూడా   బంగారాన్ని ఖాతాదారులకు ఇవ్వలేదు. దీంతో  బాధితులు  పోలీసులను ఆశ్రయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios