Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో కెసినో కలకలం... ఫుల్లుగా మద్యం, అమ్మాయిలతో డ్యాన్సులు... చివరకు జరిగిందిదీ..!

ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి కెసినో కలకలం రేగింది. గోవాకు చెందిన నిర్వహకులు విజయవాడ పరిసరాల్లో కెసినో ఏర్పాటుచేయడం, దీనికి భారీగాా ప్రచారం చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. 

goa organisers arranged Casino Party in Vijayawada
Author
Hyderabad, First Published Jun 22, 2022, 11:46 AM IST

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి కెసినో కలకలం రేగింది. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి పండగ సందర్భంగా గుడివాడలో కెసినో నిర్వహించారంటూ జరిగిన ప్రచారం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇదే కృష్ణా జిల్లాలో అధికారికంగా కెసినో నిర్వహణకు రంగం సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు. 

కృష్ణా జిల్లా కంకిపాడులో కెసినో ఏర్పాటుకు గోవాకు చెందిన ఓ కంపనీ ఏర్పాట్లుచేసింది. కంపనీ ప్రమోషన్ కోసం ఓ హోటల్లో కేసినో నిర్వహించాలని భావించిన నిర్వహకులు ఎక్సైజ్ ఉన్నతాధికారుల నుండి   మద్యం వినియోగానికి అనుమతి తీసుకున్నారు. అయితే హోటల్ నిర్వహకులకు మాత్రం కెసినో నిర్వహణ గురించి చెప్పకుండా గోప్యంగా ఉంచారు. 

కెసినో ఆడాలన్న ఆసక్తి గలవారు సదరు హోటల్ కు రావాలని... మద్యంతో పాటు అమ్మాయిల డ్యాన్సులు, డీజే ఉన్నాయంటూ నిర్వహకులు ప్రచారం చేసుకున్నారు. దీంతో తమ హోటల్లో తమకు తెలియకుండానే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటుచేయడం గురించి యాజమాన్యం కంగుతింది.  క్యాసినోలో డ్యాన్సులు, విందులు, వినోదాలు చేసుకోవాలంటే పోలీస్ పర్మిషన్ కావాలన్న హోటల్ నిర్వాహకులు అభ్యంతరం చేసారు.  

దీంతో చేసేదేమిలేక కెసినో నిర్వహకులు అనుమతుల కోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీస్ ఉన్నతాధికారులు కెసినో నిర్వహణకు అనుమతి నిరాకరించారు. దీంతో ఇవాళ (బుధవారం) జరగాల్సిన కెసినో ఆగిపోయింది. 

అయితే ఈ కెసినో వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అధికార వైసిపికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కంపెనీ ప్రమోషన్ కోసం వచ్చి, పూర్తిస్థాయి అనుమతులు రాకపోవడంతో గోవాకు చెందిన కేసినో నిర్వాహకులు తిరిగి వెళ్లిపోయారని అంటున్నారు. ఈ కెసినో నిర్వహణకు జరిగిన ఏర్పాట్లలో వైసిపి ప్రమేయమేమీ లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కొన్ని ఎల్లో మీడియా (టిడిపి అనుకూల మీడియా) సంస్థలు వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేస్తోందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

గత సంక్రాంతి సందర్భంగా పేకాట, కోడిపందాలతో పాటు క్యాసినో గ్యాంబ్లింగ్ వంటి పందాల్లో మూడు రోజుల్లో కోట్లాది రూపాయల మేరకు చేతులు మారాయని టిడిపి ఆరోపిస్తోంది.  రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖామంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో గోవా క్యాసినో కల్చర్.. నృత్యాలు సంబంధించిన విష‌యాలు వివాద‌స్ప‌ద‌ంగా మారాయి. గుడివాడ క్యాసినో గాంబ్లింగ్‌, అక్క‌డి నృత్యాల‌పై టీడీపీ బృందం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పేరుతో గ్యాంబ్లింగ్‌ అసభ్యకర నృత్యాలు జరిగాయని టీడీపీ నేత‌ల బృందం ఆరోపించింది. 

గుడివాడ కే కన్వెన్షన్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్‌, క్యాసినో నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరికట్టాల్సిన పోలీసులు వాటిని నివారించలేకపోయారని పేర్కొన్నారు. కనుమ పండుగ రోజు గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఎ-కన్వెన్షన్‌ లో విచ్చలవిడిగా బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, చట్టవిరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 500 కోట్ల రూపాయలు మేరా డబ్బులు క్యాసినో ద్వారా చేతులు మారాయని వారు ఆరోపించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగువారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. సంఘ విద్రోహక శక్తులు కూడా పెద్ద ఎత్తున చొరపడ్డారని లేఖ ద్వారా తెలిపారు.

 

  
  

Follow Us:
Download App:
  • android
  • ios